For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI Rate Hike: శుభవార్త చెప్పనున్న ఆర్బీఐ.. లోన్స్ తీసుకునే వారికి పెద్ద ఊరట.. పూర్తి వివరాలు

|

RBI Rate Hike: గడచిన కొన్ని నెలలుగా భారతీయ రిజర్వు బ్యాంక్ తన వడ్డీ రేట్లను పెంచుతూ పోతోంది. మార్కెట్లో లిక్విడిటీని తగ్గించటానికి.. తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రంతో కలిసి రిజర్వు బ్యాంక్ రెపో రేట్ల పెంపులో దూకుడును ప్రదర్శించింది. ఈ క్రమంలో ఫిబ్రవరిలో ద్రవ్యపరపతి సమావేశం ఉండటం.. ఎన్నికలకు ముందు కేంద్ర వార్షిక బడ్జెట్ రావటం చాలా కీలకంగా మారాయి.

కనిష్ఠానికి ద్రవ్యోల్బణం..

కనిష్ఠానికి ద్రవ్యోల్బణం..

రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబరులో ఏడాది కనిష్ఠ స్థాయి అయిన 5.72%కి తగ్గింది. దాదాపు 20 మంది ఆర్థికవేత్తలు మింట్ నిర్వహించిన పోల్ లో ద్రవ్యోల్బణం 5.9%గా అంచనా వేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు అదుపులో ఉన్నందున రిజర్వు బ్యాంక్ తన దూకుడుకు కళ్లెం వేయవచ్చని అందరూ అంచనా వేస్తున్నారు. ఒకవేళ అలా జరగకపోతే మార్కెట్లో డిమాండ్ మరింతగా ప్రభావితం అవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు..

ఇప్పటి వరకు..

ప్రధాన ద్రవ్యోల్బణం ముఖ్యంగా ఆహారం, ఇంధనం కూడా కొంత మేర తగ్గటం ఆర్థికంగా పుంజుకోవటానికి దోహదపడుతోంది. అయితే ఇవి సెంట్రల్ బ్యాంక్ రానున్న సమావేశం నిర్ణయాల్లో ప్రతిధ్వనించవచ్చని తెలుస్తోంది. మే 2022 నుంచి గత డిసెంబర్ లో జరిగిన సమావేశం వరకు రిజర్వు బ్యాంక్ రెపో రేటును దశలవారీగా 225 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఇదే క్రమంలో యూఎస్ ఫెడరల్ రిజర్వు సైతం వడ్డీ రేట్లను భారీగా 425 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.

RBI శుభవార్త..

RBI శుభవార్త..

అక్టోబర్-డిసెంబర్ కాలానికి భారతదేశ ప్రధాన ద్రవ్యోల్బణం RBI అంచనా కంటే తక్కువగా ఉండటంతో, సెంట్రల్ బ్యాంక్ తన వ్యూహాన్ని మార్చుకోవచ్చని ఆర్థికవేత్త అంకితా పాఠక్ తెలిపారు. ఇదే క్రమంలో మాట్లాడిన ICRA చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్.. ఫిబ్రవరిలో రేట్ల పెంపును రిజర్వు బ్యాంక్ నిలిపివేయవచ్చని అన్నారు. CPI ద్రవ్యోల్బణం ప్రస్తుతం రిజర్వు బ్యాంక్ లిమిట్స్ లోనే ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు.

ఆర్థికాభివృద్ధి..

ఆర్థికాభివృద్ధి..

ఈ ఏడాది భారత వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని భారత ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. సెంట్రల్ బ్యాంక్ మాత్రం ఇది 6.8 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. మెుత్తానికి చాలా మంది ఆర్థిక నిపుణులు భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం వృద్ధి బాటలోనే ముందుకు సాగుతుందని భావిస్తున్నారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిన భారత్ పరిస్థితి చాలా మెరుగైన స్థాయిలో ఉందని వారు అంటున్నారు.

Read more about: rbi rbi rate hike rbi mpc repo rate
English summary

RBI Rate Hike: శుభవార్త చెప్పనున్న ఆర్బీఐ.. లోన్స్ తీసుకునే వారికి పెద్ద ఊరట.. పూర్తి వివరాలు | Good News Experts expecting RBI may Pause Repo Rate Hike In February MPC Meeting

Good News Experts expecting RBI may Pause Repo Rate Hike In February MPC Meeting
Story first published: Wednesday, January 18, 2023, 14:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X