For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Goldman Sachs: వచ్చే సంవత్సరం భారత ఆర్థిక వృద్ధి తగ్గుతుందా..!

|

వచ్చే ఏడాది భారతదేశ ఆర్థిక వృద్ధికి సంబంధించి అంచనాను గోల్డ్‌మ్యాన్ సాచ్స్ గ్రూప్ ఇంక్ తగ్గించింది.
స్థూల దేశీయోత్పత్తి ఈ సంవత్సరం అంచనా వేయగా 6.9 శాతం అంచనా వేయగా దాన్ని 2023 సంవత్సరానికి 5.9 శాతంగా అంచనా వేశామని ఆండ్రూ టిల్టన్ నేతృత్వంలోని గోల్డ్‌మ్యాన్ ఆర్థికవేత్తలు ఆదివారం ఒక నివేదికలో తెలిపారు.

రెండు భాగాలుగా
"పెరుగుదల అనేది రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి సగం నెమ్మదిగా ఉంటుంది" అని నివేదికలో పేర్కొన్నారు. "రెండవ అర్ధభాగంలో ప్రపంచ వృద్ధి పుంజుకోవడం, నికర ఎగుమతుల నుంచి డ్రాగ్ తగ్గడంతో వృద్ధి మళ్లీ వేగవంతం అయ్యే అవకాశం ఉంది" అని వివరించారు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్ ఒకటిగా ఉందని పేర్కొన్నారు.

 Goldman Sachs Group predicts Indias growth to be 5.9 in 2023

యూఎస్ ఫెడరల్ రిజర్వ్
యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం, ధరల పెరుగుదల సవాళుగా మారే అవకాశం ఉందని వివరించారు. 2023 ద్వితీయార్థంలో భారతదేశ వృద్ధి పుంజుకోవడానికి అవకాశం ఉందన్నారు. US డాలర్‌తో పోలిస్తే కొంత తరుగుదల ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న కరెన్సీలలో రూపాయి ఒకటి అని గోల్డ్‌మన్ విశ్లేషకులు తెలిపారు. ద్రవ్యోల్బణం కూడా ఈ సంవత్సరం అంచనా వేసిన 6.8 శాతం నుంచి వచ్చే క్యాలెండర్ సంవత్సరంలో 6.1 శాతానికి తగ్గుతుందని పేర్కొంది.

English summary

Goldman Sachs: వచ్చే సంవత్సరం భారత ఆర్థిక వృద్ధి తగ్గుతుందా..! | Goldman Sachs Group predicts India's growth to be 5.9 in 2023

Goldman Sachs Group Inc predicts that India's economic growth will decelerate through 2023. Next year growth is expected to be 5.9 percent.
Story first published: Monday, November 21, 2022, 17:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X