For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price In World: బంగారం ధర భారత్‌లో కంటే పాకిస్థాన్‌లో తక్కువ.. ఇతర దేశాల్లో ఎలా ఉందంటే..

|

Gold Price In World: వివిధ దేశాల్లో బంగారం ధర భిన్నంగా ఉంటుంది. భారతదేశంలో ఒక వ్యక్తి 10 గ్రాముల బంగారం కొనడానికి వెళ్తే దాదాపు 50 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. అటువంటి పరిస్థితిలో.. బంగారం ధర ప్రతిచోటా ఒకేలా ఉందా లేదా ఇతర దేశాలలో భిన్నంగా ఉంటుందా అనే అనేక ప్రశ్నలు మీ మనస్సులో చాలాసార్లు వచ్చి ఉంటుంది. వీటన్నింటికీ సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్‌లో బంగారం ధర..

భారత్‌లో బంగారం ధర..

ఈ రోజు భారతదేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం కొనడానికి ఒక వ్యక్తి రూ.50,390 చెల్లించాలి.

పాకిస్థాన్‌లో బంగారం ధర..

పాకిస్థాన్‌లో బంగారం ధర..

ప్రస్తుతం.. పాకిస్థాన్‌లో బంగారం 10 గ్రాములకు 1,14,938 పాకిస్తానీ రూపాయల చొప్పున విక్రయించబడుతోంది. అంటే దాదాపు రూ.1.15 లక్షలు. భారతీయ రూపాయల్లో దీని ధర దాదాపు 44 వేల రూపాయలని చెప్పుకోవాలి. అంటే.. భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్‌లో బంగారం చౌకగా ఉంది.

ఆఫ్ఘనిస్తాన్‌లో బంగారం ధర..

ఆఫ్ఘనిస్తాన్‌లో బంగారం ధర..

ఆఫ్ఘనిస్తాన్‌లో బంగారం 10 గ్రాముల బంగారం ధర 48,273 ఆఫ్ఘని (ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ)లో లభిస్తోంది. దీని విలువ భారత కరెన్సీలోకి కన్వర్ట్ చేసినట్లయితే..దాదాపు 44,034గా ఉంది. అంటే ఈ లెక్కన మన దేశంలో కంటే ఆఫ్ఘనిస్తాన్‌లో బంగారం చౌకగా అందుబాటులో ఉంది.

ఇండోనేషియాలో బంగారం ధర..

ఇండోనేషియాలో బంగారం ధర..

ఇండోనేషియాలో ఒక గ్రాము బంగారం ధర 8,24,380.17 ఇండోనేషియా రూపాయలు. అంటే 10 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయడానికి.. అక్కడి ప్రజలు దాదాపు 82,43,801 ఇండోనేషియా రూపాయలు చెల్లించాలి. ఇది భారతీయ రూపాయల్లోకి కన్వర్ట్ చేస్తే దాదాపు 44 వేల రూపాయలకు సమానం.

నేపాల్‌లో బంగారం ధర..

నేపాల్‌లో బంగారం ధర..

పొరుగున ఉన్న చిన్న దేశం నేపాల్‌లో 10 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయడానికి అక్కడి ప్రజలు 77,680 నేపాల్ రూపాయలు వెచ్చించాలి. మన భారత కరెన్సీలోకి దీనిని కన్వర్ట్ చేసినట్లయితే 10 గ్రాముల గోల్డ్ విలువ దాదాపు రూ.48,790గా ఉంటుంది. ఇది భారత దేశంలో ధరల కంటే కొంత తక్కువ అని చెప్పుకోవాలి. ఏదేమైనా భారత్ కంటే ఈ చిన్న దేశాల్లోనే పసిడి ధరలు తక్కువగా ఉన్నాయి.

English summary

Gold Price In World: బంగారం ధర భారత్‌లో కంటే పాకిస్థాన్‌లో తక్కువ.. ఇతర దేశాల్లో ఎలా ఉందంటే.. | gold rates are cheaper in these countries in the world than india

gold rates are cheaper in nepal, afghanistan, indonesia and pakistan than india know complete details..
Story first published: Monday, July 18, 2022, 17:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X