For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold prices today: స్థిరంగా బంగారం ధరలు, వెండి రూ.70,000కు సమీపంలో

|

బంగారం ధరలు నేడు(మే 5 బుధవారం) స్వల్పంగా పెరిగాయి. ఇటీవలి వరకు రూ.47,000కు పైనే ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న ఈస్థాయి దిగువకు వచ్చింది. నేడు స్వల్పంగా పెరిగినప్పటికీ ఈ మార్కు దిగువనే ఉంది. వెండి ఫ్యూచర్ ధరలు నేడు స్వల్పంగా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ పెరిగి 1780 డాలర్లు దాటగా, సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గి 27 డాలర్ల దిగువన ట్రేడ్ అయింది. గత ఏడాది ఆగస్ట్ 56,200తో బంగారం ధర ప్రస్తుతం రూ.9300 తక్కువగా ఉంది. గత నెలలో ఓ సమయంలో రూ.12000కు పైగా కూడా తగ్గింది. ఈ కాలంలో పసిడి రూ.2500కు పైగా పెరిగింది.

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు క్రితం సెషన్లో రూ.100.00 వరకు పెరిగాయి. గత నెలలో ఓ సమయంలో రూ.44,000 దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.47,000కు దిగువకు పడిపోయింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.105.00 (0.22%) తగ్గి రూ.46976.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,979.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,046.00 గరిష్టాన్ని, రూ.46,650.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.86.00 (0.18%) తగ్గి రూ.47283.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,338.00 వద్ద ప్రారంభమై, రూ.47,430.00 గరిష్టాన్ని, రూ.47,011.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.69 వేల పైన వెండి

రూ.69 వేల పైన వెండి

వెండి ఫ్యూచర్ ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.114.00 (0.16%) తగ్గి రూ.69535.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,066.00 వద్ద ప్రారంభమై, రూ.70,138.00 గరిష్టాన్ని, రూ.68,809.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.114.00 (-0.16%) తగ్గి రూ.69535.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,066.00 ప్రారంభమైన ధర, రూ.70,138.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,809.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 1780 డాలర్ల పైకి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 6.15 (0.35%) డాలర్లు పెరిగి 1,782.15 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,769.55 - 1,798.95 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. 0.002 (+0.01%) డాలర్లు పెరిగి 26.560 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.168 - 27.233 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

Gold prices today: స్థిరంగా బంగారం ధరలు, వెండి రూ.70,000కు సమీపంలో | Gold rate: Yellow metal trades flat, silver tops Rs 70,000

Gold prices were almost flat on Wednesday, as concerns over possibility of a higher US interest rates countered a subdued dollar, while palladium held firm after scaling a record high in the previous session.
Story first published: Wednesday, May 5, 2021, 22:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X