For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold rate today: బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే

|

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు పెరగడం, ఫెడ్ వడ్డీ రేట్లు పెరుగుదల మళ్లీ ఆలస్యమవుతుందనే ఆందోళనలు పసిడి పైన ప్రభావం చూపాయి. దీంతో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.237 పెరిగి రూ.47,973 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.272 ఎగిసి రూ.48,115 వద్ద ట్రేడ్ అయింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పది గ్రాముల గోల్డ్ ఫ్యూచర్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.8200 తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు పెరిగాయి. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 5.45 డాలర్లు పెరిగి 1826.90 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో పోలిస్తే 250 డాలర్ల వరకు తక్కువగా ఉంది.

సిల్వర్ ఫ్యూచర్స్ రూ.62,000 క్రాస్ చేశాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.215 పెరిగి రూ.62,135 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.212 లాభపడి రూ.62,786 వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.79,000తో పోలిస్తే రూ.17000 వరకు తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.045 పెరిగి 23.207 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

Gold rate today: Yellow metal rises over Rs 100, nears Rs 48,000 level

అమెరికాలో నిరుద్యోగిత రేటు గతవారం భారీగా పెరిగింది. అన్-ఎంప్లాయిమెంట్ క్లెయిమ్స్ 1,99,000 అంచనా వేయగా, ఏకంగా 2,30,000కు చేరుకుంది. ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర 1808-1796 డాలర్లు, నిరోధకస్థాయి 1834-1845 డాలర్లుగా ఉంది. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ మద్దతు ధర రూ.47,800-47,480, నిరోధకస్థాయి రూ.47,900-48,050గా ఉంది.

English summary

Gold rate today: బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే | Gold rate today: Yellow metal rises over Rs 100, nears Rs 48,000 level

Gold prices were trading higher on Friday, poised for a strong weekly gain in more than two months. The higher inflation and pressure on bond yields may keep gold prices up for the medium term.
Story first published: Friday, January 14, 2022, 13:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X