For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Prices Today: రెండు నెలల్లో రూ.5000 తగ్గిన బంగారం ధర

|

బంగారం ధరలు ఇటీవల భారీ ఊగిసలాటలో కనిపిస్తున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం రూ.50,000 దిగువకు పడిపోయినప్పటికీ, ఆ తర్వాత రూ.52,000కు చేరువైంది. ఇప్పుడు తిరిగి రూ.51,000 స్థాయికి క్షీణించింది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‍‌లో రూ.64 పెరిగి రూ.50,935 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.94 పెరిగి రూ.51,080 వద్ద ట్రేడ్ అయింది.

సిల్వర్ ఫ్యూచర్స్ ఇటీవల రూ.60,000 దిగువకు పడిపోయినప్పటికీ, ఇప్పుడు రూ.62,000 స్థాయిని దాటింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో రూ.409 పెరిగి రూ.62,202 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.392 పెరిగి రూ.62,870 వద్ద కదలాడింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో చూస్తే ప్రస్తుతం రూ.5300 తక్కువగా ఉంది.

Gold Prices Today: Struggle in markets, down ₹5000 in 2 months

సిల్వర్ ఫ్యూచర్స్ రూ.17000 వరకు తక్కువగా ఉంది. పసిడి ధరలు గత రెండు నెలల కాలంలో రూ.5000 తగ్గాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రూ.55,500కు చేరుకున్న పసిడి ధరలు ఇప్పుడు రూ.51,000 దిగువన ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1850 డాలర్ల దిగువకు వచ్చినప్పటికీ, ఇప్పుడు ఈ మార్కును క్రాస్ చేసింది. 1860 డాలర్ల దిశగా పరుగు పెడుతోంది. నేటి సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 7 డాలర్ల మేర లాభపడి 1854 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.162 డాలర్లు ఎగిసి 22.127 డాలర్ల వద్ద కదలాడింది. ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో 220 డాలర్ల మేర తక్కువగా ఉంది.

English summary

Gold Prices Today: రెండు నెలల్లో రూ.5000 తగ్గిన బంగారం ధర | Gold Prices Today: Struggle in markets, down ₹5000 in 2 months

Gold prices struggled for direction today amid weak global cues. Though US dollar and US bond yields have pulled back from recent highs, a rebound in global equities is weighing on the safe-haven demand for the precious metal, say analysts.
Story first published: Friday, May 27, 2022, 13:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X