For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

|

బంగారం ధరలు సోమవారం(ఆగస్ట్ 23) ప్రారంభ సెషన్‌లో స్థిరంగా లేదా అతి స్వల్పంగా పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ వరుసగా నాలుగో రోజు ఒత్తిడిలో ఉంది. డాలర్ వ్యాల్యూ క్రమంగా బలపడటం బంగారంపై ప్రభావం చూపుతోంది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగాపెరిగినప్పటికీ, కిలో రూ.62,000కు దిగువనే ఉంది. బంగారం ధరలు ఈ నెల ప్రారంభంలో నాలుగు నెలల కనిష్టానికి రూ.45,600 దిగువకు పడిపోయాయి. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీన గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56.200కు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ 1800 డాలర్ల దిగువనే ఉన్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ 23 డాలర్ల సమీపంలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.1 శాతం క్షీణించి 1779 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డాలర్ ఇండెక్స్ 93.33 డాలర్లతో తొమ్మిదిన్నర నెలల గరిష్టానికి చేరుకుంది.

బంగారం ధరలు ఇలా

బంగారం ధరలు ఇలా

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 1792 డాలర్ల పైనే కదలాడుతుంటే 1800 డాలర్లు దాటి, 1815 డాలర్లకు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. వచ్చే వారం యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్ జెరోమ్ పోవెల్ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడనున్నారు. ఆయన ఈ నెల 27వ తేదీన స్పందించనున్నారు. ప్రస్తుతం కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1770 డాలర్ల నుండి 1820 డాలర్ల మధ్య ఉండవచ్చునని, దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో రూ.46,965- రూ.47,580 మధ్య కనిపించవచ్చునని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నవ్‌నీత్ దమానీ అన్నారు.

సిల్వర్ ఫ్యూచర్స్ కామెక్స్‌లో 23.90 డాలర్ల పైనే ఉంటే మరింత పైకి చేరే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అంతర్జాతీయ అతిపెద్ద గోల్డ్ ట్రేడెడ్ ట్రస్ట్ ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ వద్ద బంగారం నిల్వలు శుక్రవారం నాటికి 0.3 శాతం క్షీణించి 1,011.61 కు తగ్గాయి.

ఫ్యూచర్ మార్కెట్లో ధరలు

ఫ్యూచర్ మార్కెట్లో ధరలు

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు నేడు ప్రారంభ సెషన్లో స్వల్పంగా పెరిగాయి. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.70.00 (0.15%) పెరిగి రూ.47228.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.104.00 (0.22%) పెరిగి రూ.47410.00 వద్ద ట్రేడ్ అయింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.258.00 (0.42%) లాభపడి రూ.61979.00 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.241.00 (0.39%) ఎగిసి రూ.62716.00 వద్ద ట్రేడ్ అయింది.

ఇటీవల రూ.62,000 దిగువన ట్రేడ్ అవుతున్న సిల్వర్ ఫ్యూచర్స్ నేడు ఓ సమయంలో రూ.62వేలను క్రాస్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 4.80(0.27%) డాలర్లు లాభపడి 1,788.80 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.086 (0.37%) డాలర్లు ఎగిసి 23.198 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

బంగారం ధరలు ఎక్కడ ఎంత?

బంగారం ధరలు ఎక్కడ ఎంత?

నేడు ఉదయం వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.22 క్యారెట్ల బంగారం ముంబైలో రూ.46,190, చెన్నైలో రూ.44,630, ఢిల్లీలో రూ.46,280, కోల్‌కతాలో రూ.46,480, బెంగళూరులో రూ.44,130, హైదరాబాద్‌లో రూ.44,130, కేరళలో రూ.44,130, అహ్మదాబాద్‌లో రూ.46,630, జైపూర్‌లో రూ.46,320, లక్నోలో రూ.46,280, పాట్నాలో రూ.45,480, నాగపూర్‌లో రూ.46,190, పుణేలో రూ.45,480గా ఉంది.

English summary

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? | Gold prices today stay weak for 4th day in a row

Spot gold fell 0.1% to $1,779.12 per ounce while the dollar index traded near the 9-1/2-month highs of 93.33. However, losses in gold were capped amid growing concerns over the economic fallout from the spread of the Delta coronavirus variant.
Story first published: Monday, August 23, 2021, 11:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X