For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు: ఆల్ టైం గరిష్టంతో రూ.7,400 డౌన్

|

బంగారం ధరలు నేడు (గురువారం, జనవరి 14) భారీగా తగ్గాయి. ధరలు మళ్లీ రూ.49,000 దిగువకు క్షీణించాయి. కొద్దిరోజులుగా పసిడి ధరలు పైకీ కిందకు కదులుతున్నాయి. ఇటీవల రూ.52వేల దిగువ నుండి రూ.48,000 పైన కదలాడుతున్నాయి. డాలర్ క్షీణించడం, యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ తక్కువగా ట్రేడ్ కావడంతో బంగారం ధరలపై ప్రభావం పడింది. అమెరికా ఆర్థిక ప్యాకేజీ కూడా ఉంది. పసిడి ధరలు ఇప్పటికీ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.7400 వరకు తక్కువగా ఉంది.

ప్రపంచ టాప్ 500లో రిలయన్స్, టీసీఎస్ సహా 11 కంపెనీలు: వీటి వ్యాల్యూ ఎంతంటేప్రపంచ టాప్ 500లో రిలయన్స్, టీసీఎస్ సహా 11 కంపెనీలు: వీటి వ్యాల్యూ ఎంతంటే

49,000 దిగువకు పసిడి

49,000 దిగువకు పసిడి

నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 505.00 (-1.02%) తగ్గి రూ.48,800.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,000.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,049.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,751.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7400 వరకు తక్కువగా ఉంది.

ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.-480.00 (-0.97%) తగ్గి రూ.48,805.00 వద్ద ప్రారంభమైంది. రూ.49,177.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,177.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,765.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

దాదాపు వెయ్యి తగ్గిన వెండి

దాదాపు వెయ్యి తగ్గిన వెండి

సిల్వర్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా భారీగానే తగ్గింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 911.00 (-1.38%) తగ్గి రూ.65110.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,103.00 వద్ద ప్రారంభమై, రూ.65,578.00 వద్ద గరిష్టాన్ని, రూ.64,933.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.890.00 (-1.33%) తగ్గి రూ.65952.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,048.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,300.00 వద్ద గరిష్టాన్ని, రూ.65952.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1850 డాలర్ల దిగువకు

1850 డాలర్ల దిగువకు

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1850 డాలర్ల దిగువకు చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 15.30 (-0.82%) డాలర్లు తగ్గి 1,839.60 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,829.70 - 1,851.60 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 17.8% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. ఔన్స్ ధర 0.342 (-1.34%) డాలర్లు తగ్గి 25.230 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.113 - 25.543 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 42.51 శాతం పెరిగింది.

English summary

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు: ఆల్ టైం గరిష్టంతో రూ.7,400 డౌన్ | Gold prices today fall sharply, silver rates slump Rs 500

Gold prices fell sharply in Indian markets with MCX February futures slumping below the ₹49,000 level. Gold was down 0.9% or ₹450 to ₹48,860 per 10 gram while silver futures slumped 1.4% or ₹900 to ₹65,127 per kg. The precious metal is now down about ₹7500 from record highs of ₹56,200, hit in August.
Story first published: Thursday, January 14, 2021, 17:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X