For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

|

బంగారం ధరలు సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో, అలాగే భారత మార్కెట్లో స్వల్పంగా పడిపోయాయి. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.47 శాతం తగ్గి రూ.41,010 వద్ద ఉంది. శనివారం బడ్జెట్ సమయంలో ఈ ధర రూ.41,250గా ఉంది. ఈ నెలలో రూ.41,293 రికార్డ్ ధరగా ఉంది. వెండి ధరలు మార్చి ఫిబ్రవరి ఫ్యూచర్స్ కిలోకు 1.27 శాతం తగ్గి రూ.46,518 వద్ద ట్రేడ్ అయింది.

ఆదాయపు పన్ను గురించిన మరిన్ని కథనాలు

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు 0.5 శాతం తగ్గి 1,580.52 వద్ద ఉంది. కరోనా వైరస్ కారణంగా చైనా మార్కెట్లు ఈ రోజు 9 శాతం మేర నష్టపోయాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గత వారం చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించింది.

 Gold prices today fall sharply, silver rates slump

కరోనా వైరస్ కారణంగా వివిధ దేశాల నుంచి చైనాకు వెళ్లే విమానాలు రద్దయ్యాయి. చైనా నుంచి వచ్చే తమ దేశీయులకు అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ చైనా ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపుతోంది. దీంతో చైనా సెంట్రల్ బ్యాంకు 1.2 ట్రిలియన్ యువాన్లను (173.81 బిలియన్ డాలర్లు) లిక్విడిటీని మార్కెట్లోకి పంపిస్తామని తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ఇన్వెస్టర్లు పెట్టుబడుల స్వర్గధామంగా భావించే బంగారం వైపు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా, బంగారం ఏప్రిల్ కాంట్రాక్ట్ గత గరిష్టస్థాయి రూ.41,567ను పరీక్షించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఈ స్థాయిని అధిగమించకుంటే తిరిగి నష్టపోతుందంటున్నారు. లేదా రికార్డ్ హైకి చేరవచ్చునని చెబుతున్నారు. వెండి మార్చ్ కాంట్రాక్ట్ రూ.46,789 కంటే దిగువన ట్రేడ్ అయితే స్వల్ప, మధ్య కాలంలో మరింత కిందకు దిగి రావొచ్చునని, రూ.46,670 కంటే దిగువకు ట్రేడ్ కాకుంటే షార్ట్ సెల్ పొజిషన్లు తీసుకోవవద్దంటున్నారు.

English summary

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు | Gold prices today fall sharply, silver rates slump

Gold and silver prices fell today in Indian markets, tracking a decline in global rates. On MCX, April gold futures were down 0.47% to ₹41,010 per 10 gram. On Saturday, in the special Budget day session, gold prices had jumped as much as ₹41,250 at day's high, approaching record high of ₹41,293 hit earlier this month. Silver prices saw a sharper fall today. On MCX, March February futures fell 1.27% to ₹46,518 per kg.
Story first published: Monday, February 3, 2020, 13:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X