ముంబై: నిన్నటి వరకు భారీగా పతనమైన పసిడి ధరలు నేడు (మార్చి 9, మంగళవారం) ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా పెరిగాయి. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడం ఆర్థిక రికవరీపై ఆశలతో ఈ ఏడాది ఆరంభం నుండి పసిడి ధరలు తగ్గుతున్నాయి. 2021లో ఇప్పటి వరకు రూ.5,000 వరకు తగ్గాయి. కరోనా వ్యాక్సీన్ ప్రక్రియ ముమ్మరంగా చేపట్టడం, కేంద్రబ్యాంకులు నిధులను అందుబాటులోకి తీసుకురావడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పరుగు పెడుతున్నాయి. ఈ ప్రభావం పసిడిపై పడుతోంది. పైగా బిట్ కాయిన్ మరో గోల్డ్‌గా అవతరించింది. దీంతో పసిడిపై పెట్టుబడులు తగ్గాయి. పసిడి ధర నిన్న రూ.500 వరకు తగ్గింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.468 తగ్గి రూ.44,215 వద్ద, జూన్ ఫ్యూచర్స్ రూ.423 తగ్గి రూ.44,443 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. నిన్న మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.253 పెరిగి రూ.65,856 వద్ద, రూ.395 పెరిగి రూ.66,951 వద్ద ముగిసింది.

11 నెలల కనిష్టానికి సమీపంలో
గోల్డ్ ఫ్యూచర్ ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.రూ.11,850 వరకు తక్కువగా ఉంది. దాదాపు 11 నెలల కనిష్టానికి సమీపంలో ఉంది.
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు ఉదయం సెషన్లో రూ.44,500 దిగువనే ఉంది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.113.00 (0.26%) పెరిగి రూ.44,331.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,349.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,387.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,310.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12,000 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. రూ.153.00 (0.34%) పెరిగి రూ.44584.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,550.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,600.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,550.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

66వేలు దాటిన వెండి
వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.233.00 (0.35%) పెరిగి రూ.66085.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,177.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,272.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,066.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. కిలో రూ.331.00 (0.49%) పెరిగి రూ.67249.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,249.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,249.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,249.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఎలా ఉందంటే
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ, 1700 డాలర్లకు దిగువనే ఉన్నాయి. నేటి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 8.75
(+0.52%) డాలర్లు పెరిగి 1686.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,676.85 - 1,688.55 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల వద్ద ఉంది. ఔన్స్ ధర 0.138 (+0.55%) డాలర్లు పెరిగి 25.402 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.095 - 25.503 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications