For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెల రోజుల గరిష్టాన్ని తాకిన తర్వాత రూ.1300 తగ్గిన బంగారం ధరలు

|

రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. నిన్న భారీగా పడిపోయిన పసిడి ధరలు, నేడు ప్రారంభ సెషన్‌లో స్వల్ప తగ్గుముఖం పట్టాయి. ఉదయం గం.9.40 సమయానికి ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.136 తగ్గి రూ.50,528 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.139 తగ్గి రూ.50,760 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.210 తగ్గి రూ.60,101 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.216 క్షీణించి రూ.60,792 వద్ద ట్రేడ్ అయింది. బంగారం ధరలు రెండు రోజుల్లో రూ.1300 వరకు తగ్గింది. పసిడి ధరలు రెండు రోజుల క్రితం నెల రోజుల గరిష్టాన్ని తాకిన తర్వాత భారీగా పడిపోయాయి.

బంగారం, వెండి ధరలు క్రితం సెషన్‌లోనూ భారీగా తగ్గాయి. నిన్న ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1041 తగ్గి రూ.50,660, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1038 తగ్గి రూ.50,892 వద్ద ముగిసింది. ఒక్కరోజులోనే రెండు శాతానికి పైగా క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్‌లోను గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1875 డాలర్ల స్థాయి నుండి 1830 డాలర్ల దిగువకు వచ్చింది. ఎంసీఎక్స్‌లో వెండి ధరలు కూడా భారీగానే పడిపోయాయి. నిన్న జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1620 తగ్గి రూ.60,309 వద్ద ముగిసింది.

Gold prices fall after hitting 1 month high, silver rates drop sharply

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్లో 3.60 డాలర్లు తగ్గి 1828 డాలర్లు, సిల్వర్ ఫ్యూచర్స్ 0.075 డాలర్లు క్షీణించి 21.180 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1831 డాలర్లకు పడిపోయింది. నిన్న ఒక్కరోజే 40 డాలర్లకు పైగా క్షీణించింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఏడాదిలో 3.5 శాతం, సిల్వర్ ఫ్యూచర్స్ 25 శాతం తగ్గింది.

English summary

నెల రోజుల గరిష్టాన్ని తాకిన తర్వాత రూ.1300 తగ్గిన బంగారం ధరలు | Gold prices fall after hitting 1 month high, silver rates drop sharply

Gold and silver rates were today weak in Indian markets amid subdued global rates. On MCX, gold futures were down 0.3% to ₹51551 while silver futures dropped 1% to ₹61,321 per kg.
Story first published: Tuesday, June 14, 2022, 9:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X