For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ పెరుగుదల తర్వాత స్థిరంగా బంగారం ధరలు, వెండి రూ.70,000కు సమీపంలో..

|

బంగారం ధరలు నేడు (మే 4 మంగళవారం) దాదాపు స్థిరంగా ఉన్నాయి. నిన్న దాదాపు రూ.600 పెరిగి రూ.47,300 దాటిన 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్, నేడు అతి స్వల్పంగా క్షీణించాయి. దీంతో రూ.47,300 దిగువకు వచ్చాయి. నిన్న రూ.2వేలకు పైగా పెరిగిన సిల్వర్ నేడు దాదాపు స్థిరంగా ఉంది. వెండి రూ.70వేల సమీపానికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి 1790 డాలర్ల దిగువకు వచ్చింది. గత ఏడాది ఆగస్ట్ 56,200తో బంగారం ధర ప్రస్తుతం రూ.9000 తక్కువగా ఉంది. గత నెలలో ఓ సమయంలో రూ.12000కు పైగా కూడా తగ్గింది. ఈ కాలంలో పసిడి రూ.3000కు పైగా పెరిగింది.

భారీ పెరుగుదల తర్వాత స్థిరంగా

భారీ పెరుగుదల తర్వాత స్థిరంగా

బంగారం ధరలు క్రితం సెషన్లో రూ.600 వరకు పెరిగాయి. గత నెలలో ఓ సమయంలో రూ.44,000 దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.47,300కు సమీపంలో ఉంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.58.00 (0.12%) తగ్గి రూ.47261.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,226.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,314.00 గరిష్టాన్ని, రూ.47,226.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.80.00 (0.17%) తగ్గి రూ.47562.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,579.00 వద్ద ప్రారంభమై, రూ.47,580.00 గరిష్టాన్ని, రూ.47,562.00 కనిష్టాన్ని తాకింది.

రూ.70వేలకు సమీపంలో వెండి

రూ.70వేలకు సమీపంలో వెండి

వెండి ఫ్యూచర్ ధరలు నేడు అతి స్వల్పంగా పెరిగాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.27.00 (0.04%) పెరిగి రూ.69898.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,898.00 వద్ద ప్రారంభమై, రూ.69,898.00 గరిష్టాన్ని, రూ.69,898.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.171.00 (-0.24%) తగ్గి రూ.70729.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,611.00 ప్రారంభమైన ధర, రూ.70,830.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,611.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 1790 డాలర్లకు దిగువన ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 3.45 (0.19%) డాలర్లు పెరిగి 1,788.35 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,788.55 - 1,793.60 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. 0.077 (0.29%) డాలర్లు తగ్గి 26.883 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.855 - 27.058 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

భారీ పెరుగుదల తర్వాత స్థిరంగా బంగారం ధరలు, వెండి రూ.70,000కు సమీపంలో.. | Gold price today: Yellow metal trades lower, silver near Rs 70,800

Gold and silver futures prices dropped lower up on Tuesday, as a stronger dollar and optimistic comments from US Federal Reserve Chairman Jerome Powell on the economy weighed on the metal's safe-haven appeal.
Story first published: Tuesday, May 4, 2021, 10:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X