For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా ఎన్నికలు, కరోనా: పెరిగిన బంగారం, వెండి ధరలు: ఈ వారం ఎలా ఉండనుంది?

|

గతవారం కమోడిటీ ధరలు క్షీణించాయి. ప్రధానంగా క్రూడాయిల్ ధరలు భారీగా క్షీణించాయి. పసిడి, సిల్వర్ కూడా తగ్గుముఖం పట్టింది. క్రూడాయిల్ ధరలు 10 శాతానికి పైగా పడిపోగా, డిమాండ్ నేపథ్యంలో నేచరల్ గ్యాస్ 12 శాతం వరకు ర్యాలీ సాధించింది. బంగారం ధరలు 2019 నుండి వరుసగా మూడవ నెల నష్టపోయాయి. ఆగస్ట్ మొదటి వారంలో ఔన్స్ పసిడి 2,075 డాలర్లు పలకగా, ఇప్పుడు 1900 డాలర్ల కిందకు దిగి వచ్చింది. ధరలు ఆల్ టైమ్ గరిష్టం నుండి 9 శాతం క్షీణించాయి. అతిపెద్ద గోల్డ్ ట్రెడెడ్ ఈటీఎఫ్ ఎస్పీడీఆర్ గోల్డ్ వద్ద బంగారం నిలవలు గత నెలతో పోలిస్తే ఈ నెల 1275 టన్నుల నుండి 1257.67 టన్నులకు పడిపోయింది.

మళ్లీ తగ్గిన ప్రీమియం, రిటైలర్లకు దసరా జోష్.. దీపావళి రెడీమళ్లీ తగ్గిన ప్రీమియం, రిటైలర్లకు దసరా జోష్.. దీపావళి రెడీ

ఈ వారం గోల్డ్ ఎలా ఉండవచ్చు

ఈ వారం గోల్డ్ ఎలా ఉండవచ్చు

బంగారం ధరలు ఈ వారం ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50,990 స్థాయిని అధిగమిస్తే రూ.51,200కు, రూ.51,680 పైకి పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. రూ.50,060 దిగువకు వస్తే రూ.49,860 దిగువకు కూడా పడిపోవచ్చునని అంచనా వేస్తున్నారు. గతవారం పసిడి ధరలు రూ.50,700 వద్ద క్లోజ్ అయిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, కరోనా కేసుల పెరుగుదల వంటి అంశాలు పసిడిపై ఈ వారం ప్రభావం చూపనున్నాయి.

వెండి డిసెంబర్ ఫ్యూచర్ సానుకూలంగా కనిపిస్తోంది. రూ.62,850 స్థాయిని అధిగమిస్తే భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, రూ.62,265 వద్ద స్టాప్ లాస్‌తో రూ.62,813 వద్ద కాంట్రాక్టుకు లాంగ్ పొజిషన్లు తీసుకోవచ్చునని సూచిస్తున్నారు.

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో..

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో..

బంగారం ధరలు నేటి (నవంబర్ 2) ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీ (MCX)లో 10 గ్రాముల పసిడి డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.26 పెరిగి రూ.50,725 వద్ద ట్రేడ్ అయింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.4 పెరిగి రూ.50,808 పలికింది. వెండి రూ.665 (1.09 శాతం) పెరిగి కిలో రూ.61,530 పలికింది. మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.718 (1.15 శాతం) పెరిగి రూ.63,162 పలికింది.

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో పసిడి ఫ్యూచర్స్ ఔన్స్ 0.07 శాతం ఎగిసి 1881.30 డాలర్లు వద్ద, వెండి 1.28 శాతం లాభపడి ఔన్స్ 23.945 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

మార్కెట్...

మార్కెట్...

నిఫ్టీ గతవారం 11,535 పాయింట్ల నుండి 11,943 పాయింట్ల మధ్య కదలాడింది. 288 పాయింట్ల నష్టంతో 11,700 దిగువన ముగిసింది. ఈ వారం మార్కెట్ అమెరికా ఎన్నికల ఫలితాలు, కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ఈ వారం అంతర్జాతీయ పరిస్థితులే కీలకమని చెబుతున్నారు.

English summary

అమెరికా ఎన్నికలు, కరోనా: పెరిగిన బంగారం, వెండి ధరలు: ఈ వారం ఎలా ఉండనుంది? | Gold price today: Yellow metal rise above Rs 50,725 ahead of US polls

Commodity prices traded lower in the week gone by with crude oil prices falling the most at more than 10 percent while Natural gas rallied by nearly 12 percent on strong winter demand.
Story first published: Monday, November 2, 2020, 10:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X