For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిన్న భారీగా పెరిగి నేడు తగ్గిన బంగారం ధరలు: రూ.300 తగ్గిన పసిడి, రూ.1000 తగ్గిన వెండి

|

నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు బుధవారం (నవంబర్ 4) తగ్గుముఖం పట్టాయి. ఉదయం గం.10.36 సమయానికి దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.278 (0.54 శాతం) క్షీణించి రూ.51,320 పలికింది. నిన్న పసిడి రూ.500కు పైగా పెరిగింది. రూ.51,500ను క్రాస్ చేసింది. అమెరికా ఎన్నికలు, ఫలితాల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు, బులియన్ మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నాయి. ఈ రోజు అమెరికా ఫలితాలు వెల్లడవుతున్నాయి. ట్రంప్‌పై బిడెన్ ముందంజలో ఉన్నారు.

బంగారం నిన్న భారీగా పెరిగి నేడు డౌన్

బంగారం నిన్న భారీగా పెరిగి నేడు డౌన్

డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,320.00 వద్ద ప్రారంభమై, రూ.51,465.00 వద్ద గరిష్టాన్ని, రూ.51,260.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.138(0.27 శాతం) క్షీణించి రూ.51,570 వద్ద ట్రేడ్ అయింది. రూ.51,535.00 వద్ద ఓపెన్ కాగా, రూ.51,610.00 వద్ద గరిష్టాన్ని, రూ.51,514.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.రూ.5800 వరకు తక్కువగా ఉంది. నిన్న పసిడి రూ.500కు పైగా పెరిగింది.

నిన్న భారీగా పెరిగి, నేడు తగ్గుదల

నిన్న భారీగా పెరిగి, నేడు తగ్గుదల

వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.1,0.38 (1.66 శాతం) క్షీణించి రూ.61,647 పలికింది. రూ.61,420.00 వద్ద ప్రారంభం కాగా, రూ.61,980.00 వద్ద గరిష్టాన్ని, రూ.61,415.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మార్చి ఫ్యూచర్స్ రూ.1,107(1.72 శాతం) క్షీణించి రూ.63,300 పలికింది. రూ.63,452 వద్ద ప్రారంభం కాగా, రూ.63,650 వద్ద గరిష్టాన్నిరూ.63250 వద్ద కనిష్టాన్ని తాకింది. నిన్న రెండువేల రూపాయలకు పైగా పెరిగిన పసిడి నేడు రూ.1000కి పైగా తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు

అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు క్షీణించాయి. 1900 డాలర్లకు పైగా క్షీణించాయి. 1,882.80 - 1,917.85 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. భారత కాలమానం ప్రకారం ఉదయం గం.11 సమయానికి ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.61 శాతం క్షీణించి 1,898.70 డాలర్లు పలికింది. నిన్న 1910 వద్ద క్లోజ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 2.15 శాతం క్షీణించి 23.808 డాలర్లు పలికింది. 23.275 - 24.595 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 24.334 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 33 శాతం వరకు పెరిగింది.స్పాట్ గోల్డ్ 0.4 శాతం క్షీణించింది. అధ్యక్ష ఎన్నికల్లో జోబిడెన్, ట్రంప్ మధ్య పోటా పోటీ నెలకొంది. డాలర్ వ్యాల్యూ స్వల్పంగా పెరిగింది.

English summary

నిన్న భారీగా పెరిగి నేడు తగ్గిన బంగారం ధరలు: రూ.300 తగ్గిన పసిడి, రూ.1000 తగ్గిన వెండి | Gold price today: Yellow metal retreats from highs

Gold was trading lower on November 4 tracking a muted trend in the international spot prices as the dollar strengthened after early results showed a close contest between President Donald Trump and Democratic challenger Joe Biden in the US presidential election.
Story first published: Wednesday, November 4, 2020, 11:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X