For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: రికార్డ్ గరిష్టం నుండి రూ.11,300 తక్కువగా బంగారం

|

దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు నేడు అతి స్వల్పంగా క్షీణించాయి. నేడు ప్రారంభ సెషన్‌లో అతి స్వల్పంగా పెరిగినప్పటికీ రూ.45,000 దిగువనే కదలాడాయి. అయితే సాయంత్రం సెషన్‌కు స్వల్పంగా నష్టపోయి, రూ.44,900 దిగువకు పడిపోయింది. పసిడి ధరలు ఢిల్లీ స్పాట్ మార్కెట్లో నేడు రూ.100 వరకు పెరిగి రూ.46,900 పలికింది. వెండి కిలో రూ.68,800 పలికింది. సోమవారంతో పోలిస్తే వెండి రూ.300, బంగారం రూ.100 పెరిగింది. గత మూడు నాలుగు రోజులుగా పసిడి ధరల్లో పెద్దగా మార్పులు లేవు.

బంగారం స్వల్పంగా తగ్గుదల

బంగారం స్వల్పంగా తగ్గుదల

గోల్డ్ ఫ్యూచర్ ధరలు నేడు ప్రారంభ సెషన్లో స్వల్పంగా పెరిగినప్పటికీ, ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.40.00 (-0.09%) తగ్గి రూ.44860.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,950.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,086.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,766.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,300 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.59.00 (0.13%) తగ్గి రూ.45238.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,348.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,450.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,159.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.500 డౌన్

వెండి రూ.500 డౌన్

వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.534.00 (-0.79%) తగ్గి రూ.67135.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,572.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,814.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,801.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా తగ్గింది. కిలో రూ.471.00 (-0.69%) తగ్గి రూ.68199.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,580 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,820 వద్ద గరిష్టాన్ని, రూ.67,886 వద్ద కనిష్టాన్ని తాకింది.

కామెక్స్‌లో ఇలా

కామెక్స్‌లో ఇలా

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. 1730 డాలర్ల వద్దే ఉంది. నేటి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 1.55 (+0.09%) డాలర్లు తగ్గి 1,730.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,724.50 - 1,740.15

డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల పైన ఉంది. ఔన్స్ ధర 0.233 (-0.89%) డాలర్లు పెరిగి 26.055 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.898 - 26.407 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

Gold Price Today: రికార్డ్ గరిష్టం నుండి రూ.11,300 తక్కువగా బంగారం | Gold Price Today: Yellow metal cheaper by Rs 11,300 per 10 grams from record level

The spot price of Gold in Delhi is around Rs 46,900, which is up by Rs 100 from the last reporting price on Monday. The spot price of silver is Rs 68,800, which has gone up by Rs 300 from the last reporting price of Monday, after remaining unchanged over the past 3-4 days.
Story first published: Tuesday, March 16, 2021, 22:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X