For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: ఫెడ్ ఎఫెక్ట్, బంగారం ధరలు భారీగా తగ్గాయి

|

ముంబై: బంగారం ధరలు ఈ వారం పైకీ, కిందకు కదులుతున్నాయి. ఈ వారం ప్రారంభ సెషన్‌లో లాభపడిన బంగారం, తర్వాత సెషన్‌లో స్వల్పంగా క్షీణించింది. నిన్న మరోసారి రూ.300కు పైగా పెరిగినప్పటికీ, నేడు ప్రారంభ సెషన్‌లో మళ్లీ అంతేస్థాయిలో తగ్గింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.345.00 (-0.74%) క్షీణించి రూ.46327.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.357.00 తగ్గి రూ.46460.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లోను నేడు గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా 15 డాలర్లు పడిపోయింది. నిన్న 1778 డాలర్లకు పైన ముగిసిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 1763 డాలర్లకు దిగి వచ్చింది. సిల్వర్ ఫ్యూచర్ కూడా క్షీణించినప్పటికీ కిలో రూ.60,000కు పైనే ఉంది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్ రూ.650.00 (-1.06%) తగ్గి రూ.60530.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్ రూ.670.00 తగ్గి రూ.61268.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 22.500 డాలర్లకు పైనే ఉంది. నేడు ప్రారంభ సెషన్‌లో 0.314 (-1.37%) డాలర్లు క్షీణించి 22.593 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

అందుకే బంగారం ధరలు తగ్గాయి

అందుకే బంగారం ధరలు తగ్గాయి

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా క్షీణించాయి. యూఎస్ ఫెడ్ ప్రస్తుతం వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అయితే వడ్డీ రేట్లను సాధ్యమైనంత తొందరగా సవరించే అవకాశాలు ఉన్న సంకేతాలు కనిపించాయి. అంచనాల కంటే సవరణ అవకాశాలు ముందుకు జరగడం బులియన్ మార్కెట్ పైన ప్రభావం చూపింది. దీంతో నిన్న స్పాట్ గోల్డ్ 0.3 శాతం క్షీణించి 1762.33 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్ 0.9 శాతం క్షీణించి 1762.10 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు కూడా అదే స్థాయిలో కదలాడుతోంది. సిల్వర్ ఫ్యూచర్ 22.55 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. తమ మంత్లీ బాండ్ పర్చేజెస్ తగ్గించడం నవంబర్ నుండి ప్రారంభిస్తామని ఫెడ్ రిజర్వ్ ప్రకటించింది. అప్పుడు వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రభావం పసిడి పైన కనిపించింది.

మరింత తగ్గడానికి...

మరింత తగ్గడానికి...

బాండ్ యీల్డ్స్ పైన ఫెడ్ ప్రకటన, దీంతో వడ్డీ రేట్లు 2022 నాటికి పెరుగుతాయనే అంచనాలు వచ్చాయని, ఇది బంగారంపై ప్రభావం చూపుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం తక్షణ మద్దతు 1755 డాలర్లు, నిరోధకస్థాయి 1775 డాలర్లు. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం రూ.46,700 వద్ద పరీక్షను ఎదుర్కోవచ్చునని, రూ.46,200 దిగువకు వస్తే మరింత తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలు బంగారంపై ఒత్తిడిని కలిగిస్తోందని, మున్ముందు ధరలు మరింత తగ్గడానికి దోహదపడుతుందని చెబుతున్నారు.

1760 డాలర్లకు పైనే

1760 డాలర్లకు పైనే

చైనా ఎవర్ గ్రాండ్ మరో లేమాన్ బ్రదర్స్ కాబోతుందని, మరోసారి ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చుననే ఆందోళనలు వచ్చాయి. దీంతో ఈ వారం ప్రారంభంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అదే సమయంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధరలు పెరిగాయి. పెడ్ నిర్ణయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దీంతో బంగారం ధరలు నిన్న కాస్త స్థిరంగా కనిపించాయి. ఫెడ్ నిర్ణయం తర్వాత క్షీణిస్తున్నాయి. అయితే 1760 డాలర్లకు పైనే ఉన్నాయి.

English summary

Gold Price Today: ఫెడ్ ఎఫెక్ట్, బంగారం ధరలు భారీగా తగ్గాయి | Gold Price Today: Yellow metal below RS 46,500, Silver Dips to Rs 60,585

Gold price in India dropped significantly on Thursday after the US Federal Reserve had indicated easing its monthly bond purchases by next year.
Story first published: Thursday, September 23, 2021, 10:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X