For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,000 తక్కువ

|

బంగారం ధరలు ఈవారం దాదాపు స్థిరంగా ప్రారంభమయ్యాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46,000 పైనే ఉన్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.60,000 పైన ఉంది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1750 డాలర్ల దిగువనే ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ 22 డాలర్ల పైన ఉంది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.35.00 (0.08%) పెరిగి రూ.46030.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.57.00 (0.12%) పెరిగి రూ.46136.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.391.00 (0.65%) పెరిగి రూ.60346.00 వద్ద ట్రేడ్ అయింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.318.00 (0.52%) పెరిగి రూ.60958.00 వద్ద ట్రేడ్ అయింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,000 తక్కువగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 4.15 (0.24%) డాలర్లు పెరిగి 1,747.55 డాలర్ల వద్ద, 0.085 (+0.38%) డాలర్లు పెరిగి 22.510 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. చైనా ఎవర్ గ్రాండ్ అనంతరం గతవారం గోల్డ్ ఫ్యూచర్స్ 1750 డాలర్ల పైన ట్రేడ్ అయింది. అయితే ఈ వారం ఈ దిగువకు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.5 శాతం ఎగిసి 1,757.79 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డాలర్ ఇండెక్స్ ప్రారంభ సెషన్‌లో 0.12 శాతం లాభపడి 93.22 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

Gold price today rises but still down RS 10,000 from record highs

యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ క్రమంగా పెరుగుతున్నాయి. యూఎస్ బెంచ్ మార్క్ టెన్ ఇయర్ ట్రెజరీ యీల్డ్స్ జూలై తర్వాత మొదటిసారి ఆల్ టైమ్ గరిష్టాన్ని చేరుకున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు పెరిగాయి. ప్రపంచ అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ వద్ద హోల్డింగ్స్ శుక్రవారం 0.1 శాతం పెరిగి 993.52 టన్నులుగా నమోదయింది. అంతకుముందు గురువారం 992.65 టన్నులుగా ఉంది.

English summary

బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,000 తక్కువ | Gold price today rises but still down RS 10,000 from record highs

Gold and silver prices edged higher in Indian markets, tracking positive global cues. On MCX, gold futures rose 0.33% to ₹46,147 per 10 gram while silver rose 1% to ₹60,583 per kg.
Story first published: Monday, September 27, 2021, 16:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X