For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పెరిగిన ధరలు, భారత్‌లో పసిడి డిమాండ్ 25 ఏళ్ల కనిష్టానికి

|

2020లో భారత్‌లో బంగారం డిమాండ్ 35 శాతం క్షీణించి 25 ఏళ్ళ కనిష్టానికి పడిపోయింది. గత ఏడాది పసిడి డిమాండ్ 446.4 టన్నులకు పరిమితమైంది. 2021లో మళ్లీ పుంజుకోవచ్చుననే అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (wcg) నివేదిక వెల్లడించింది. మార్కెట్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, ప్రభుత్వం కూడా నిలకడగా చర్యలు చేపడుతోందని, ఈ సంస్కరణలు తమ రంగాన్ని బలోపేతం చేస్తాయని wcg చెబుతోంది. అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ 11 శాతం తగ్గింది. ధరలు పెరగడం కూడా డిమాండ్ పైన ప్రభావంచూపింది.

2019లో 690.4 టన్నులుగా ఉన్న డిమాండ్, 2020లో 35 శాతం తగ్గి 446.4 టన్నులకు పడిపోయింది. విలువపరంగా 14 శాతం తగ్గింది. అయితే ఇందుకు ధరలు భారీగా పెరగడం కారణం. అందుకే విలువ పరంగా తక్కువగా ఉంది. జ్యువెల్లరీ డిమాండ్ 42 శాతం క్షీణించి 315.9 టన్నులకు, పెట్టుబడుల డిమాండ్ 11 శాతం తగ్గి 130.4 టన్నులకు పరిమితమైంది. పండుగ సీజన్, పెళ్లిళ్ల కారణంగా అక్టోబర్-డిసెంబర్ కాలంలో డిమాండ్ పెరిగింది. 2019లో ఇదే కాలంతో పోలిస్తే శాతమే తగ్గింది.

Gold demand in India hit 25 year low in 2020

ఆభరణాల డిమాండ్ 8 శాతం తగ్గి 137.3 టన్నులకు చేరుకుంది. పెట్టుబడుల గిరాకీ 8 శాతం పెరిగి 48.9 టన్నులుగా ఉంది. 2020లో మొత్తం 95.5 టన్నుల బంగారం పునర్వినియోగానికి వచ్చింది. గత ఏడాది 119.5 టన్నుల పసిడి వినియోగమైంది.

English summary

భారీగా పెరిగిన ధరలు, భారత్‌లో పసిడి డిమాండ్ 25 ఏళ్ల కనిష్టానికి | Gold demand in India hit 25 year low in 2020

Gold demand in India hit a 25-year low at 446.4 tonnes in 2020, compared with 690.4 tonnes in 2019 due to the COVID-19 induced lockdown and on account of record high prices, the India office of the World Gold Council said.
Story first published: Friday, January 29, 2021, 9:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X