For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Crorepati Stock: లక్షను కోట్లుగా మార్చిన ఫేమస్ కంపెనీ.. మీకూ ఇందులో షేర్స్ ఉన్నాయా..

|

Multibagger Stock: 15-20 సంవత్సరాల్లో ఇన్వెస్టర్లను లక్షాధికారులుగా మార్చిన స్టాక్స్ చాలా ఉన్నాయి. ఈ షేర్లు కాలక్రమేణా రూ.లక్షల పెట్టుబడులను కోట్లుగా మార్చేశాయి. 20 ఏళ్లలో స్టాక్ మార్కెట్ అనేక రెట్లు లాభపడిన తరుణంలో.. చాలా కంపెనీల షేర్లు అనేక రెట్లు పెరిగి ఇన్వెస్టర్లను ధనవంతులను చేశాయి. అలాంటి కోవకు చెందిన స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కంపెనీ వివరాలు..

కంపెనీ వివరాలు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది గోద్రెజ్ కన్స్యూమర్ స్టాక్ గురించే. గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ స్టాక్ దాదాపు 21 సంవత్సరాలుగా చాలా బలమైన రిటర్న్స్ అందిస్తూనే ఉంది. జూన్ 22, 2001న BSEలో షేరు ధర కేవలం రూ.4.10 వద్ద ఉండగా.. శుక్రవారం ఈ స్టాక్ ధర రూ.874 వద్ద ముగిసింది. ఈ కాలంలో స్టాక్ దాదాపు 21,217.07 శాతం వృద్ధిని నమోదు చేసింది.

బలమైన రాబడులు..

బలమైన రాబడులు..

స్టాక్ ధర రూ.4.10 వద్ద ఉన్న సమయంలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్టర్లకు దాదాపు రూ.2.13 కోట్లకుపైగా మారి ధనవంతులయ్యారు. ఆగస్టు 10, 2012న స్టాక్ రూ.206.65గా ఉంది. అంటే 10 ఏళ్లలో 4 రెట్లకు పైగా ఇన్వెస్టర్ల సొమ్ము పెరిగింది. ఈ కాలంలో స్టాక్ 322.94 శాతం రాబడిని ఇవ్వటంతో లక్ష పెట్టుబడి రూ.4.23 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.89,250 కోట్లుగా ఉంది. BSEలో 52 వారాల గరిష్ఠ ధర రూ. 1,138.50 వద్ద ఉండగా.. కనిష్ఠ ధర రూ.660.20గా ఉంది.

కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ దేశంలోని ముంబై కేంద్రంగా పనిచేసే వినియోగదారు వస్తువుల సంస్థ. ఇది సబ్బులు, హెయిర్ కలర్స్, లిక్విడ్ డిటర్జెంట్లు వంటి వస్తువులను తయారు చేస్తోంది. దీని బ్రాండ్లలో 'సింథోల్', 'గోద్రెజ్ ఫెయిర్ గ్లో', 'గోద్రెజ్ నెం.1' ఉండగా.. సబ్బుల్లో 'గోద్రెజ్ షికాకై', హెయిర్ కలరెంట్‌లలో 'గోద్రెజ్ పౌడర్ హెయిర్ డై', 'రెన్యూ', 'కలర్‌సాఫ్ట్', 'ఈజీ' లిక్విడ్ డిటర్జెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీకి దేశ వ్యాప్తంగా ఏడు తయారీ కేంద్రాలు ఉన్నాయి.

ఎన్నో విదేశీ కంపెనీల కొనుగోలు..

ఎన్నో విదేశీ కంపెనీల కొనుగోలు..

గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 2005లో కీలైన్ బ్రాండ్స్ లిమిటెడ్ (యునైటెడ్ కింగ్‌డమ్), 2006లో రాపిడోల్ లిమిటెడ్, 2007లో గోద్రెజ్ గ్లోబల్ మిడ్ ఈస్ట్ ఎఫ్‌జెడ్‌ఈ, అర్జెంటీనాలోని అర్గాన్‌కోస్ వంటి విదేశీ కంపెనీలను కొనుగోలు చేసి, తర్వాత చిలీ కంపెనీ కాస్మెటికా నేషనల్‌ను కొనుగోలు చేసింది. 2015లో గోద్రెజ్ దక్షిణాఫ్రికా హెయిర్ ఎక్స్‌టెన్షన్ సంస్థ ఫ్రికా హెయిర్‌లో 100% ఈక్విటీ వాటాను పూర్తిగా కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. కంపెనీ దేశమంతటా విస్తృత పంపిణీ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇది పట్టణ, గ్రామీణ మార్కెట్లలో మరింతగా విస్తరిస్తోంది.

English summary

Crorepati Stock: లక్షను కోట్లుగా మార్చిన ఫేమస్ కంపెనీ.. మీకూ ఇందులో షేర్స్ ఉన్నాయా.. | Godrej Consumer Products stock gave multibagger returns to its investors as Crorepatis

this consumer goods stock turned investors as crorepatis with mutibagger returns
Story first published: Monday, August 8, 2022, 15:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X