For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత ఆర్థిక వ్యవస్థను దేవుడు మాత్రమే కాపాడాలి: చిదంబరం

|

ఢిల్లీ: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం మంగళవారం భారత ఆర్థిక వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ బీజేపీ ఎంపీ చేసిన జీడీపీ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఇండియన్ ఎకానమీని కేవలం దేవుడు మాత్రమే కాపాడాలని పేర్కొన్నారు. సదరు ఎంపీపై మండిపడ్డారు. ఇటీవల ఇండియన్ జీడీపీ వృద్ధి రేటు ఆందోళన కలిగిస్తోన్న విషయం తెలిసిందే. ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, రియల్ వంటి వివిధ రంగాల్లో ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నాయి.

ప్రయాణీకులకు ఆర్టీసీ షాక్, ఛార్జీల పెంపు: కి.మీ.కు ఎంతప్రయాణీకులకు ఆర్టీసీ షాక్, ఛార్జీల పెంపు: కి.మీ.కు ఎంత

ఇలాంటి సందర్భంలో లోకసభలో వివిధ బిల్లులు ప్రవేశ పెట్టిన సమయంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే మాట్లాడుతూ... గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (GDP) నెంబర్స్ అసంబద్ధమని పేర్కొన్నారు. అంతేకాదు, ఇది రామాయణం, మహాభారతం, బైబిల్ ఏమీ కాదన్నారు. దీనిపై చిద్దూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ట్వీట్ చేశారు.

God save Indias economy: Chidambaram on BJP MPs GDP remark

బీజేపీ సంస్కరణలు ఇలా ఉంటాయని చిదంబరం ఎద్దేవా చేశారు. ఇలాంటి సందర్భంలో దేవుడు మాత్రమే కాపాడగలరని ఆయన పేర్కొన్నారు. అవినీతి, మనీ లాండరింగ్ కేసులో ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. కాగా, బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై సోమవారం కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూఇండియా అనుభవం లేని ఆర్థికవేత్తల నుంచి ప్రజలను ఆ దేవుడు కాపాడుతాడని పేర్కొన్నారు.

జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ 4.5గా నమోదైంది. అంతకుముందు క్వార్టర్‌లో 5 శాతంగా నమోదైంది. దీనిపై పార్లమెంటులో ఎంపీ దుబే మాట్లాడుతూ.. త్వరలో జీడీపీని లెక్కలోకి తీసుకోవడం ఉండదని అభిప్రాయపడ్డారు. 1934కు ముందు ఈ ఎకనమిక్ సూచీ ఉనికిలో లేదని, అదే అంతిమ సత్యం కాదన్నారు.

English summary

భారత ఆర్థిక వ్యవస్థను దేవుడు మాత్రమే కాపాడాలి: చిదంబరం | God save India's economy: Chidambaram on BJP MP's GDP remark

former finance minister P Chidambaram on Tuesday took a dig at the BJP over its MP Nishikant Dubey's remarks that the GDP has no relevance, saying God save India's economy.
Story first published: Tuesday, December 3, 2019, 12:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X