For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోఎయిర్ 'గోఫ్లైప్రైవేట్' ఆఫర్, విమానంలో సొంత ప్రయివేట్ జోన్!

|

బడ్జెట్ క్యారియర్ గోఎయిర్ శుక్రవారం సరికొత్త సురక్షిత స్కీంతో ముందుకు వచ్చింది. గోఫ్లైప్రయివేట్ (GoFlyPrivate)తో తమ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణీకులకు ప్రయివేట్ జోన్ ట్రావెలింగ్ వెసులుబాటును కల్పిస్తోంది. దీని కోసం ప్రయాణీకులు ఒకే PNR పైన మల్టిపుల్ వరుసల్లో సీట్లను బుక్ చేసుకోవచ్చు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరం తప్పనిసరిగా మారిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణీకులకు ఇబ్బందిగా అనిపిస్తే వారు సొంతగా ప్రయివేట్ జోన్ క్రియేట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

గుడ్‌న్యూస్: ఉద్యోగాలు పెరుగుతున్నాయి, ఏ రంగంలో ఎంతంటే? బెంగళూరు, పుణే అదుర్స్!గుడ్‌న్యూస్: ఉద్యోగాలు పెరుగుతున్నాయి, ఏ రంగంలో ఎంతంటే? బెంగళూరు, పుణే అదుర్స్!

గోఫ్లై ప్రయివేట్

గోఫ్లై ప్రయివేట్

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణీకులు బహుళ వరుసలు బుక్ చేసుకునేందుకు 'గోఫ్లై‌ప్రయివేట్'ను ప్రవేశ పెట్టింది. తద్వారా వారు ప్రయివేటు జోన్ క్రియేట్ చేసుకోవచ్చు. సురక్షిత ప్రయాణ ధీమాను కల్పించేందుకు ఈ సరికొత్త స్కీంను ప్రవేశ పెట్టింది. కరోనా వ్యాప్తిని నిరోధించే ఉద్దేశ్యంలో భాగంగా విమానయాన సంస్థలు మిడిల్ సీట్ వదిలి పెట్టడం, పక్కసీటుతో కలిపి డిస్కౌంట్‌కు ఇవ్వడం వంటి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. ఈ వైరస్ కారణంగా విమానయాన రంగంపై భారీ ప్రభావం పడింది.

మొదటి ఎయిర్ లైన్స్

మొదటి ఎయిర్ లైన్స్

ఈ మేరకు గోఎయిర్ మేనేజింగ్ డైరెక్టర్ జే-వాడియా మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి పథకం తీసుకు వచ్చిన మొదటి ఎయిర్ లైన్స్ తమదేనని, ఇందుకు తాము కొంత భరిస్తామని, అలాగే కస్టమర్ ప్రైవసీ ఉంటుందని, ప్రయివేట్ చార్టర్ అనుభూతిని కస్టమర్‌కు అందిస్తుందన్నారు. ఈ తరహా సేవలకు వినియోగదారుల నుండి డిమాండ్ పెరుగుతోందని, దేశీయ విమానాల కోసం ఈ సర్వీస్‌లు ప్రారంభించినట్లు జె-వాడియా తెలిపారు.

ఇటీవలే గోమోర్ స్కీం

ఇటీవలే గోమోర్ స్కీం

గోఎయిర్ సహా వివిధ విమానయాన సంస్థలు ఒకరే ప్యాసింజర్ రెండు సీట్లు బుక్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పించాయి. గోఎయిర్ 'న్యూమోర్' దీనిని తీసుకు వచ్చింది. ప్రయాణీకులు అదనపు భద్రత కోసం మరో సీటును కూడా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపింది. అలాగే, గోఎయిర్ ఆన్ లైన్ డాక్టర్ కన్సల్టేషన్ వెసులుబాటు కూడా కల్పిస్తోంది. గోఎయిర్ ప్రయాణీకులు 500కు పైగా ఆసుపత్రుల్లోని 3,000 మంది వైద్యులతో ఇన్‌స్టాంట్ యాక్సెస్ కలిగి ఉంటారు. ఇందుకు కన్సల్టేషన్ ఫీజు రూ.99 మాత్రమే.

English summary

గోఎయిర్ 'గోఫ్లైప్రైవేట్' ఆఫర్, విమానంలో సొంత ప్రయివేట్ జోన్! | GoAir offers GoFlyPrivate, customers can create their own private zone

In another first from GoAir, India’s most trusted brand, the airline today introduced GoFlyPrivate wherein customers can book multiple rows and create their own private zone. GoFlyPrivate allows the customer to have the confidence to travel and decide how many rows or seats he / she wants to block.
Story first published: Friday, July 24, 2020, 20:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X