For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేతనం లేని సెలవులు తీసుకోండి: 5,500 మంది ఉద్యోగులకు గోఎయిర్ షాక్

|

తమ సంస్థలో పని చేస్తున్న దాదాపు 5,500 మంది ఉద్యోగుల్లో ఎక్కువ మంది వేతనం లేని సెలవుల్లో ఉన్నారని గోఎయిర్ సంస్థ తెలిపింది. మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో తమ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

కాగ్నిజెంట్‌పై సైబర్ దాడి, రాన్సమ్‌వేర్ అటాక్‌తో క్లయింట్స్‌కు ఇబ్బందికాగ్నిజెంట్‌పై సైబర్ దాడి, రాన్సమ్‌వేర్ అటాక్‌తో క్లయింట్స్‌కు ఇబ్బంది

లాక్ డౌన్ వల్ల ఈ నిర్ణయం

లాక్ డౌన్ వల్ల ఈ నిర్ణయం

వాడియా గ్రూప్ నేతృత్వంలోని ప్రయివేటు విమానయాన సంస్థ గోఎయిర్‌లోని 5,500 మంది ఉద్యోగుల్లో అత్యధిక మంది ఉద్యోగులు మే 3 వరకు లీవ్ వితౌట్ పేలో ఉన్నట్లు తెలిపింది. లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గోఎయిర్ తెలిపింది.

వేతనం లేని సెలవు తీసుకోవాలని కోరుతున్నాం

వేతనం లేని సెలవు తీసుకోవాలని కోరుతున్నాం

ఉద్యోగులకు వేతనాలు తగ్గించడంతో పాటు రొటేషన్ విధానంలో వేతనం లేని సెలవులపై వెళ్లాలని మార్చిలోనే గోఎయిర్ సూచించింది. ఇప్పుడు లాక్ డౌన్‌ను మే 3 వరకు పొడిగించడంతో విమానాలన్నీ నిలిచిపోయాయి. దీంతో మే 3వ తేదీ వరకు వేతనం లేని సెలవు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నామని గోయిర్ శనివారం తన ఉద్యోగులకు తెలిపింది.

వారికి మాత్రం కొంత వేతనం

వారికి మాత్రం కొంత వేతనం

అవసరమైతే వేతనం లేని సెలవులను అవకాశముందని కూడా గోఎయిర్ తెలిపింది. 5,500 మంది ఉద్యోగుల్లో 10 శాతం మంది మాత్రం పని చేస్తారని, విమానాలు తిరగని సమయంలోను వారి సేవలు చాలా అవసరమని తెలిపింది. వారికి కొంత వేతనాలు చెల్లిస్తామని తెలిపింది.

టిక్కెట్ బుకింగ్స్ నిలిపివేత

టిక్కెట్ బుకింగ్స్ నిలిపివేత

మరోవైపు, మే 3వ తేదీ వరకు లౌక్ డౌన్ కొనసాగుతోంది. కానీ ఆ తర్వాత నుండి ఎయిర్‌లైన్స్ సంస్థలు టికెట్ బుకింగ్స్ కొనసాగిస్తున్నాయి. దీనిపై పౌరవిమానయాన శాఖ స్పందించింది. ఎయిర్‌లైన్స్ సంస్థలు కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు తగిన సమయం, ముందస్తు నోటీసు ఇస్తామని DGCA ఆదివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎయిరిండియా టికెట్ బుకింగ్స్ నిలిపివేసింది. మే 4వ తేదీ నుంచి ప్రయాణాలకు ఎయిరిండియాతో పాటు వివిధ ప్రయివేటు ఎయిర్‌లైన్స్ బుకింగ్స్ తీసుకున్నాయి. టిక్కెట్ బుకింగ్స్‌కు సంబంధించి నోటీసులు ఇస్తామని కేంద్రం చెప్పడంతో నిలిపివేశాయి.

English summary

వేతనం లేని సెలవులు తీసుకోండి: 5,500 మంది ఉద్యోగులకు గోఎయిర్ షాక్ | GoAir asks most staff to go on leave without pay

Low fare carrier GoAir has put most of its employees on leave without pay to cut costs as the all airline operations in India remain suspended until May 4.
Story first published: Monday, April 20, 2020, 13:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X