For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం వాట్సాప్ వర్చువల్ అసిస్టెంట్ చాట్-బోట్

|

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(RGIA)లో డ్యూటీ ఫ్రీ షాపులను నిర్వహిస్తున్న GMR హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ(HDF) ఇటీవల వాట్సాప్ వర్చువల్ అసిస్టెంట్ చాట్-బోట్ పేరిట ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ వాట్సాప్ చాట్-బోట్‌ను ఉపయోగించి అంతర్జాతీయ ప్రయాణీకులు HDFతో సంభాషించే సౌకర్యం ఉంది. వారికి ఏవైనా ప్రశ్నలు ఉంటే సమాధానం పొందవచ్చు. అప్పటికి ఇంకా ఏమైనా అవసరమైతే HDF కస్టమర్ ఎగ్జిక్యూటివ్‌కు ఫోన్ ద్వారా సంభాషించవచ్చు.

ఉత్తమ ట్రావెల్ రిటైలర్లలో ఒకటిగా..

ఉత్తమ ట్రావెల్ రిటైలర్లలో ఒకటిగా..

వాట్సాప్‌కు 2.7 బిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. ఎక్కువ మంది వినియోగించే వాట్సాప్ చాట్-బోట్ వినియోగదారులతో సంభాషించేందుకు అనువైనదిగా ఉంటుంది. వివిధ కేటగిరీల్లో 100కు పైగా బ్రాండ్స్ కలిగిన HDF మరిచిపోలేని షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అత్యుత్తమ బ్రాండ్స్ లభ్యమవుతాయి. HDF తన కస్టమర్లకు సందర్శించిన ప్రతిసారి మరిచిపోలేని షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది. తద్వారా దేశంలోని ఉత్తమ ట్రావెల్ రిటైలర్లలో ఒకటయ్యేందుకు HDF ప్రయత్నిస్తోంది.

కరోనా నేపథ్యంలో..

కరోనా నేపథ్యంలో..

కరోనా నేపథ్యంలో ఈ చాట్-బోట్ సేవలు అంతర్జాతీయ ప్రయాణికులు HDF గురించి, దాని ఉత్పత్తుల గురించి తెలుసుకోవడానికి, అవసరమైతే వ్యక్తిగతంగా సంభాషించడానికి ఉపయోగపడుతుంది. ప్రయాణీకులు వాట్సాప్ కాంటాక్ట్ 91-72729 93377పై పింగ్ చేయడం ద్వారా చాట్ చేయవచ్చు. తరచుగా అడిగే ప్రశ్నలకు తక్కువ సమయంలో సమాధానం ఇస్తారు. ప్రయాణీకులకు మరింత సహాయం అవసరమైతే, వారు దాని కోసం సంబంధిత ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. HDF కస్టమర్ ఎగ్జిక్యూటివ్ వీలైనంత త్వరగా తిరిగి కాల్ చేస్తారు. కరోనా సమయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు స్టోర్ లోకేషన్, అక్కడ భద్రత, HDF ఉత్పత్తులు, ఇతర సంబంధిత సేవలపై ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ప్రయాణికులకు ఏ సమయంలోనైనా సమాధానాలు పొందడానికి ఈ సేవలు దోహదపడతాయి.

పెరిగిన ఆన్ లైన్ షాపింగ్

పెరిగిన ఆన్ లైన్ షాపింగ్

కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ షాపింగ్ పెరిగింది. విమానాశ్రయంలో మెరుగైన కస్టమర్ సేవలు, డ్యూటీ-ఫ్రీ షాపింగ్ అనుభవాన్ని అందించడంలో ఈ సేవలు ఓ ముందడుగు. ఆసక్తిగల ప్రయాణీకులతో మొదటి టచ్ పాయింట్ వద్ద కనెక్ట్ అవ్వాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ వాట్సాప్ వర్చువల్ అసిస్టెంట్ చాట్-బోట్ ప్రయాణీకులను కొనుగోలుదారులుగా మార్చడంలో సహాయపడుతుంది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి క్రమంగా ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో HDF మరోసారి కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలకు ఉత్ప్రేరకంగా పని చేయనుంది.

English summary

అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం వాట్సాప్ వర్చువల్ అసిస్టెంట్ చాట్-బోట్ | GMR launches WhatsApp Virtual Assistant Chatbot for International Passengers

GMR led Hyderabad Duty Free launches ‘WhatsApp Virtual Assistant Chat-bot’ for International Passengers.
Story first published: Wednesday, December 2, 2020, 18:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X