For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తీవ్ర నష్టాలలో జిఎంఆర్ ఇన్‌ఫ్రా.. ఈ త్రైమాసికంలో రూ.1,120 కోట్లు నష్టం, పతనమైన షేర్ ధర

|

విమానాశ్రయ ఆపరేటర్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్ జిఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 2.87 శాతం పడిపోయి, ఈరోజు ఇంట్రాడే కనిష్ట స్థాయి 25.30 రూపాయలకు చేరుకున్నాయి. 2020 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నష్టం తరువాత జిఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఏకీకృత నికర నష్టం 1,120.51 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 280.74 కోట్లు నష్టమొచ్చిన సదరు సంస్థకు ఈ ఏడాది నష్టం మరింత పెరిగింది .

వార్షిక ప్రాతిపదికన 52 శాతం క్షీణించినట్లు పేర్కొన్న జిఎంఆర్ ఇన్ఫ్రా

వార్షిక ప్రాతిపదికన 52 శాతం క్షీణించినట్లు పేర్కొన్న జిఎంఆర్ ఇన్ఫ్రా

కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 32 శాతం తగ్గి 1,359 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇది 1,991 కోట్ల రూపాయలుగా ఉంది . కరోనా మహమ్మారి కారణంగా జిఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నష్టాల బాట పట్టింది. గతంతో పోలిస్తే తీవ్ర నష్టాల్లో సంస్థ చిక్కుకుంది. వార్షిక ప్రాతిపదికన 52 శాతం క్షీణించినట్లు జిఎంఆర్ ఇన్ఫ్రా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. జిఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఢిల్లీ విమానాశ్రయం యొక్క ట్రాఫిక్ వరుసగా 4.10 మిలియన్ల నుండి 7.55 మిలియన్లకు మెరుగుపడింది. అంతేకాదు వార్షిక ప్రాతిపదికన, డిసెంబర్ త్రైమాసికంలో ట్రాఫిక్ 60 శాతం తగ్గింది.

వ్యాక్సినేషన్ ,సామర్ధ్య పరిమితి సడలింపుతో పుంజుకుంటుందని ఆశాభావం

వ్యాక్సినేషన్ ,సామర్ధ్య పరిమితి సడలింపుతో పుంజుకుంటుందని ఆశాభావం

హైదరాబాద్ విమానాశ్రయం, ట్రాఫిక్ వరుసగా 1.53 మిలియన్ల నుండి 2.86 మిలియన్లకు మెరుగుపడింది .ప్రస్తుతం, భారత ప్రభుత్వం విమానయాన సంస్థలకు 80 శాతం సామర్థ్యాన్ని అనుమతించింది. సామర్థ్య పరిమితి సడలించినందున, ట్రాఫిక్‌లో గణనీయమైన పెరుగుదల ఉంటుందని మేము ఆశిస్తున్నామని జిఎంఆర్ పేర్కొంది.

అదనంగా, వేగంగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ , వేగవంతమైన పరీక్షలు విమాన ప్రయాణాన్ని మరింత పెరిగేలా చేస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. చాలా దేశాలు అత్యవసర పరిస్థితుల దృష్టి ఇక వ్యాక్సిన్ ల వాడకాన్ని ఆమోదించాయి. ఫిబ్రవరి 7, 2021 నాటికి 130 మిలియన్ మోతాదులతో ప్రపంచ వ్యాప్తంగా టీకా డ్రైవ్ కొనసాగుతోంది. వేగవంతమైన చర్యల్లో భాగంగా వ్యాక్సిన్లు వేయడం వేగవంతమైన ట్రాఫిక్ వృద్ధికి మార్గం సుగమం చేస్తుంది అని జిఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్ ఒక ప్రకటనలో తెలిపింది.

విమానాశ్రయాల విభాగం నుంచి బాగా తగ్గిన ఆదాయం

విమానాశ్రయాల విభాగం నుంచి బాగా తగ్గిన ఆదాయం

ప్రయాణికుల సామర్ధ్యాన్ని పెంచడానికి చేపట్టిన విస్తరణ పెట్టుబడులలో 49 .94 శాతం పెట్టుబడులు ఇప్పటివరకు విస్తరణ పనుల కోసం పెట్టినట్టు కంపెనీ వెల్లడించింది. హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం లో ప్రయాణికుల రద్దీ ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో పోలిస్తే 52 శాతం క్షీణించి 15.3 లక్షలకు పరిమితమైందని కంపెనీ పేర్కొంది ఇక విమానాశ్రయాల విభాగం నుంచి లభించిన ఆదాయం 1636 కోట్ల నుంచి 816 .12 కోట్లకు తగ్గిందని పేర్కొంది . ఇక ఈ విభాగంలో నష్టాలు 118 .74 కోట్ల రూపాయల నుంచి 455 . 17 కోట్ల రూపాయలకు చేరిందని తెలుస్తుంది.

Read more about: gmr fiscal year
English summary

తీవ్ర నష్టాలలో జిఎంఆర్ ఇన్‌ఫ్రా.. ఈ త్రైమాసికంలో రూ.1,120 కోట్లు నష్టం, పతనమైన షేర్ ధర | GMR Infra loses Rs 1,120 crore .. shares fall After Loss Widens In Q3

GMR Infrastructure's consolidated net loss widened to Q3 ₹ 1,120.51 crore .GMR Infrastructure - fell as much as 2.87 per cent to hit an intraday low of ₹ 25.30 .
Story first published: Monday, February 15, 2021, 18:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X