For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hyderabad Airport: ఎనర్జీ ఎఫిషియెన్సీలో జాతీయ అవార్డులు.. GMR హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ రికార్డులు..

|

GMR: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ (GBC) నిర్వహించిన 'ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్' 23వ జాతీయ అవార్డులలో GMR ఆధర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. CII జాతీయ స్థాయిలో ప్రకటించిన ''నేషనల్ ఎనర్జీ లీడర్'', ''ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియంట్ యూనిట్'' అవార్డులను గెల్చుకుంది.

ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్ 21వ ఎడిషన్ సందర్భంగా వీటిని ప్రకటించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ విభాగాల్లో అవార్డులను గెలుచుకోవటం ఇది వరుసగా నాలుగోసారి, ఆరవసారి కావటం గమనార్హం. GHIAL చీఫ్ ప్రాజెక్ట్ అండ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ శ్రీ విజయ్ రాథోడ్, శ్రీ భిక్షం భూక్యా ఈ అవర్డులను అందుకున్నారు.

మూడేళ్లలో..

మూడేళ్లలో..

గత మూడు సంవత్సరాల్లో GHIAL సుస్థిరమైన ఇంధన సామర్థ్య చర్యలతో తన కార్యకలాపాల్లో సుమారు 5.41 MUల విద్యుత్తును ఆదాచేసింది. దీని వల్ల సుమారు 4426 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గాయి. దీని వల్ల గ్రీన్ హౌజ్ గ్యాసులు కూడా చెప్పుకోదగ్గ పరిమాణంలో తగ్గాయి. ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ కింద హైదరాబాద్ విమానాశ్రయం లెవల్ 3+ "న్యూట్రాలిటీ" అక్రిడిటేషన్‌తో 'కార్బన్ న్యూట్రల్' విమానాశ్రయంగా గుర్తింపు పొందింది.

2040 నాటికి..

2040 నాటికి..

సహజ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునే పరిష్కారాలను అమలు చేయడంలో GHIAL ఎల్లప్పుడూ ముందుంటుంది. సుస్థిరత అనేది మా విమానాశ్రయ కార్యకలాపాలన్నిటిలో ప్రధానంగా ఉంటుందని సీఈవో ప్రదీప్ పణికర్ తెలిపారు. 2040 నాటికి నెట్ జీరో కార్బన్ సంస్థగా మారాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. సహజ ఇంధన వనరులను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఈ అవార్డు పునరుద్ఘాటిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉత్తమ పద్ధతులను అవలంబిస్తూ..

ఉత్తమ పద్ధతులను అవలంబిస్తూ..

రోజువారీ కార్యకలాపాల్లో ఉత్తమ పద్ధతులు, సాంకేతిక పురోగతిని అవలంబిస్తూ, ఇంధనాన్ని పొదుపుగా ఉపయోగించే కార్యకలాపాలకు గుర్తింపు లభించిందని సీఈవో అన్నారు. ఈ పోటీలో పాల్గొన్న సంస్థలు చేపడుతున్న ఇంధన పొదుపు చర్యలు, వినూత్నమైన ఆలోచనా ప్రక్రియలకు సంబంధించిన అనేక అంశాలను జ్యూరీ పరిశీలించింది.

English summary

Hyderabad Airport: ఎనర్జీ ఎఫిషియెన్సీలో జాతీయ అవార్డులు.. GMR హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ రికార్డులు.. | GMR Hyderabad Airport Wins CII National Awards of National Energy Leader & Excellent Energy Efficient Unit- 2022

GMR Hyderabad Airport Wins CII National Awards of National Energy Leader & Excellent Energy Efficient Unit- 2022 ..
Story first published: Monday, September 26, 2022, 16:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X