For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Indian Economy: భారత వృద్ధిపై నీలినీడలు.. అంచనాలు తగ్గించిన అంతర్జాతీయ సంస్థ..

|

India GDP: ఆర్థిక మందగమనం భారత జీడీపీ వృద్ధిపై ప్రభావం చూపుతుందని ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా రేటింగ్ సంస్థ S&P గ్లోబల్ సైతం తన అంచనాలను తగ్గిస్తూ ఇదే విషయాన్ని వెల్లడించింది.

తగ్గిన అంచనాలు..

తగ్గిన అంచనాలు..

2023 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతంగా నిర్ణయించింది. ఇది గతంలో ఇచ్చిన అంచనాల కంటే 30 బేసిస్ పాయింట్లు తక్కువ. అదే విధంగా 2024 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.5 శాతానికి S&P గ్లోబల్ పరిమితం చేసింది.

గతంలో అంచనాలు..

గతంలో అంచనాలు..

రేటింగ్ సంస్థ గతంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధిని 7.3 శాతంగా అంచనా వేసింది. అలాగే ఏడాది చివరి నాటికి మన దేశంలో ద్రవ్యోల్బణం 6 శాతానికి చేరుకుంటుందని చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక మందగమనం కారణంగా ఆ ప్రభావం భారత ఆర్థికంపై తక్కువగానే ఉంటుందని తెలిపింది.

వేగంగా వృద్ధి..

వేగంగా వృద్ధి..

కరోనా అనిశ్చిత అత్యధికంగా ఉన్నప్పటికీ.. 2021లో భారత ఆర్థిక వ్యవస్థ 8.5 శాతం వృద్ధిని సాధించింది. అయితే ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో వచ్చే ఏడాది భారత్‌లో వృద్ధికి మరింత మద్దతు లభించే అవకాశం ఉందని రేటింగ్ సంస్థ అభిప్రాయపడింది. కానీ ద్రవ్యోల్బణం తగ్గనందున మార్చి 2023 నాటికి ఆర్‌బీఐ బెంచ్‌మార్క్ వడ్డీ రేటును 6.25 శాతానికి పెరగవచ్చని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. ప్రస్తుతం రెపో రేటు 1.9 శాతం మేర పెరిగి 5.9 శాతానికి చేరుకుంది. ఇది గడచిన మూడేళ్లలో గరిష్ఠ స్థాయి.

అంతం కాని ప్రకంపనలు..

అంతం కాని ప్రకంపనలు..

ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ధరల పెరుగుదలకు పరోక్షంగా కారణమైంది. దీంతో డిమాండ్ సైతం భారీగా దెబ్బతింది. దేశంలో ఇటీవల ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. రిటైల్ ద్రవ్యోల్బణం 3 నెలల కనిష్ఠమైన 6.7 శాతానికి దిగిరాగా.. టోకు ధరల ద్రవ్యోల్బణం గత నెలలో 19 నెలల కనిష్ఠమైన 8.39 శాతానికి చేరుకుంది.

English summary

Indian Economy: భారత వృద్ధిపై నీలినీడలు.. అంచనాలు తగ్గించిన అంతర్జాతీయ సంస్థ.. | global rating agency S&P cut indian gdp growth rate amid economic uncertinities

global rating agency S&P cut indian gdp growth rate amid economic uncertinities
Story first published: Monday, November 28, 2022, 15:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X