For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ ఆర్థికవ్యవస్థ కోలుకోవడానికి 5 ఏళ్లు: వరల్డ్ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త

|

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. ఈ సంక్షోభం నుండి బయట పడేందుకు చాలా సమయంపడుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ కార్మెన్ రీన్‌హర్ట్ గురువారం మాట్లాడుతూ.. ఈ సంక్షోభం నుండి బయటపడేందుకు అయిదేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు.

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్, షట్ డౌన్ వంటివి చేపట్టారని, ఈ పరిమిత చర్యలు ఇప్పుడు ఎత్తివేసి, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి కనీసం 5 సంవత్సరాలు పట్టవచ్చునని చెబుతున్నారు.

2019 బెస్ట్, 2020 వరస్ట్: ఒక్కో గదిపై దారుణంగా పడిపోయిన ఆదాయం, హోటల్స్‌కు వేలకోట్ల నష్టం2019 బెస్ట్, 2020 వరస్ట్: ఒక్కో గదిపై దారుణంగా పడిపోయిన ఆదాయం, హోటల్స్‌కు వేలకోట్ల నష్టం

Global economic recovery may take 5 years, World Bank chief economist

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో ఆర్థిక వ్యవస్థ మరింతగా క్షీణించిందని, ఇది మరింత అసమానతలను పెంచుతోందని కార్మెన్ అన్నారు. సంపన్న దేశాల కంటే పేద దేశాలు ఎక్కువగా ఆర్థికంగా ప్రభావితమవుతాయన్నారు. ఇరవై ఏళ్లలో మొదటిసారి ప్రపంచ పేదరికం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, తాజా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 30,075,249 కరోనా బారిన పడ్డారు. 945,837 మంది మృతి చెందారు. 21,827,593 రికవరీ అయ్యారు. అమెరికా, ఇండియా, బ్రెజిల్, రష్యా దేశాలు టాప్ 4లో ఉన్నాయి. అమెరికాలో 6,829,281 కేసులు ఉండగా, 201,384 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో 5,122,846 కేసులు, 83,257 మరణాలు, బ్రెజిల్‌లో 4,421,686 కేసులు, 134,174 మరణాలు, రష్యాలో 1,085,281 కేసులు, 19,061 మరణాలు నమోదయ్యాయి.

English summary

ప్రపంచ ఆర్థికవ్యవస్థ కోలుకోవడానికి 5 ఏళ్లు: వరల్డ్ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త | Global economic recovery may take 5 years, World Bank chief economist

The global economic recovery from the crisis originated by the coronavirus pandemic may take as much as five years, the World Bank's chief economist Carmen Reinhart said on Thursday.
Story first published: Thursday, September 17, 2020, 17:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X