For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Glenmark Q4: నెట్ ప్రాఫిట్ భారీగా: ఫ్యాబిఫ్లూ సేల్స్ హెల్ప్: షేర్ హోల్డర్లకు డివిడెండ్

|

ముంబై: ముంబై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను సాగిస్తోన్న ప్రముఖ ఫార్మాసూటికల్స్ కంపెనీ గ్లెన్‌మార్క్.. అంచనాలకు మించి వృద్ధిరేటును అందుకుంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీన ముగిసిన 2020-2021 ఆర్థిక సంవత్సరం చివరిది, నాలుగో త్రైమాసికంలో 6.15 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన ఫ్యాబిఫ్లూ అమ్మకాలు చివరి త్రైమాసికంలో భారీ ఎత్తున కొనసాగడం వల్ల ఇది సాధ్యపడింది. గత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల కాలంలో 233.87 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసినట్లు గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్స్ కంపెనీ తెలిపింది.

ఇదివరకటి ఆర్థిక సంవత్సరం అంటే 2019-2020 చివరి త్రైమాసికంతో పోల్చుకుంటే.. 13 కోట్ల రూపాయలను అధికంగా నెట్ ప్రాఫిట్‌ను సాధించింది. గత ఏడాది ఇదే కాలానికి గ్లెన్‌మార్క్ ఫార్మా నమోదు చేసిన నెట్ ప్రాఫిట్ 220.30 కోట్లు. 2020-2021 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 2,859.90 కోట్ల రూపాయల రెవెన్యూ సాధించినట్లు తెలిపింది. అంతకుముందు నాటి ఫైనాన్షియల్ ఇయర్‌తో పోల్చుకుంటే ఈ మొత్తం 2,767.50 కోట్ల రూపాయలు.

Glenmark Q4 results: net profit up 6% at Rs 233.87 crore, helps FabiFlu sales

ఏడాది మొత్తానికీ 970.10 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ అందుకున్నట్లు గ్లెన్‌మార్క్ పేర్కొంది. ఇదివరకటి ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఆ సంస్థ 776 కోట్ల నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద 10,943.90 కోట్ల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలను నిర్వహించినట్లు గ్లెన్‌మార్క్ తెలిపింది. ఇదివరకు ఈ సంఖ్య 10,641 కోట్లుగా ఉండేది. కోవిడ్ 19 పరిస్థితుల్లోనూ తాము మెరుగైన వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ మారియో సల్దాన్హా తెలిపారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని నివారించడానికి వినియోగించే ఫ్యాబిఫ్లూ అమ్మకాల వల్లే ఇది సాధ్యపడినట్లు అంచనా వేస్తున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో తమ సంస్థ షేర్లను కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ డివిడెండ్‌ను అందించాలని బోర్డు తీర్మానించినట్లు సర్దాన్హా తెలిపారు. ఒక్కో షేరు మీద రెండున్నర రూపాయల డివిడెండ్ అందిస్తామని చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దీన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు.

Read more about: mumbai ముంబై
English summary

Glenmark Q4: నెట్ ప్రాఫిట్ భారీగా: ఫ్యాబిఫ్లూ సేల్స్ హెల్ప్: షేర్ హోల్డర్లకు డివిడెండ్ | Glenmark Q4 results: net profit up 6% at Rs 233.87 crore, helps FabiFlu sales

Drug firm Glenmark Pharmaceuticals has reported a 6.15 per cent rise in its consolidated net profit to Rs 233.87 crore for the quarter ended March 2021 on account of higher sales. The drug maker’s brand FabiFlu has been at the forefront of the fight against Covid-19.
Story first published: Saturday, May 29, 2021, 15:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X