For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈఎంఐ, లోన్, అద్దె ఖర్చులు చెల్లించాక చేతిలో చిల్లిగవ్వ లేకుండా: 70% మంది పరిస్థితి ఇదే

|

కరోనా మహమ్మారి లాక్ డౌన్ నేపథ్యంలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. జూన్ నుండి రవాణా, డెలివరీ వర్కర్స్‌ ఎంతోమందికి వేతనాలు లేకుండా పోయాయి. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్సుపోర్ట్ వర్కర్స్(IFAT) సర్వే నివేదిక ప్రకారం రవాణా రంగంలో దాదాపు 70 శాతం మంది ఉద్యోగులు లేదా వర్కర్స్ నికర ఆదాయం సున్నాకు పడిపోయింది. మరో ఇరవై శాతం మంది వారానికి రూ.500 నుండి రూ.1500 అతి తక్కువ వేతనం సంపాదించారు.

డ్రైవర్, రవాణా డెలివరీ వర్కర్స్‌కు ఇంధన ఖర్చులు, వాహన ఈఎంఐలు, కమీషన్లు చెల్లించిన అనంతరం వారి చేతిలో మిగిలేది అతి కొద్ది మాత్రమే. రవాణా, డెలివరీ కార్మికుల్లో ఓలా, ఉబెర్ డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో, రాపిడో, డుంజో తదితర డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. ఇందులో చాలామంది లాక్ డౌన్ సమయంలో ఎలాంటి ఆదాయం పొందలేకపోయారు. దాదాపు 90 శాతం మంది ట్రాన్సుపోర్ట్, డెలివరీ వర్కర్స్ ఎలాంటి కిరాణా, ఆహార సహాయం పొందలేకపోయారు. అలాగే కంపెనీలు, ప్రభుత్వాల నుండి 85 శాతం మంది ఎలాంటి ఆర్థిక సహాయం కూడా పొందలేకపోయారని ఓ సర్వే వెల్లడించింది.

ముఖేష్ అంబానీ మరో సంచలనం, చైనా కంపెనీలకు హెచ్చరిక: రూ.4,000కే జియో స్మార్ట్‌ఫోన్!ముఖేష్ అంబానీ మరో సంచలనం, చైనా కంపెనీలకు హెచ్చరిక: రూ.4,000కే జియో స్మార్ట్‌ఫోన్!

ఈఎంఐ రూ.10వేల నుండి రూ.20వేలు.. ఆదాయం తక్కువ

ఈఎంఐ రూ.10వేల నుండి రూ.20వేలు.. ఆదాయం తక్కువ

లాక్ డౌన్ సమయంలో రవాణా రంగంలోని చాలామంది డ్రైవర్లకు ఆదాయాలు లేకుండా పోయాయి. ఏప్రిల్ 15వ తేదీ నుండి పని చేసిన వారిలో చాలామంది ఆదాయం సగటుకంటే రూ.2500 తక్కువగా ఉంది. సర్వే నివేదిక ప్రకారం 57 శాతం మందికి వారానికి 0 రూపాయల నుండి రూ.2,250 మధ్య మాత్రమే సంపాదించారు. అయితే ఈ రవాణా రంగం ఉద్యోగులు నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.10,000 నుండి రూ.20,000 మధ్య ఉంది.

వివిధ అంశాలు పరిగణలోకి తీసుకొని..

వివిధ అంశాలు పరిగణలోకి తీసుకొని..

ఆసియా పసిఫిక్‌లోని ఇంటర్నేషనల్ ట్రాన్సుపోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ITF), సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ ఇండియా సహకారంతో మార్చి - జూన్ 2020 మధ్య ఐఫాట్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో ఆదాయస్థాయిలు, రుణాలు, లాక్ డౌన్ సమయంలో కంపెనీలు, ప్రభుత్వాల నుండి ఆర్థిక ఉపశమనం, ఆర్థిక వ్యవస్థలు తెరవడం ప్రారంభించిన తర్వాత ఆదాయస్థాయిలను ఈ సర్వేలో పరిశీలించాయి.

అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని...

అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని...

రేషన్, అద్దె వంటి ముఖ్య ఖర్చులు, బ్యాంకులు, క్రెడిట్ సంస్థల ఈఎంఐ వంటి భారం, ఈఎంఐ తాత్కాలిక నిషేధం నేపథ్యంలో వడ్డీ రేటు చెల్లింపు వంటి అంశాలు భారంగా మారినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. మొత్తంగా దాదాపు 70 శాతం వర్కర్స్ ఎలాంటి వేతనం లేకుండా కరోనా లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కాస్త కార్యకలాపాలు ప్రారంభమైన లోన్స్, ఖర్చుల తర్వాత ఏమీ మిగలకుండా పోయింది.

English summary

ఈఎంఐ, లోన్, అద్దె ఖర్చులు చెల్లించాక చేతిలో చిల్లిగవ్వ లేకుండా: 70% మంది పరిస్థితి ఇదే | gig workers left with no income after paying EMIs, expenses

Making matters worse, drivers and delivery workers had an average monthly EMI between Rs 10,000 to 20,000, a report by the Indian Federation of App-based Transport Workers (IFAT) stated.
Story first published: Wednesday, September 23, 2020, 18:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X