For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక ప్లంబర్, బ్యూటీషియన్, ఎలక్ట్రీషియన్‌కు జీఎస్టీఎన్!

|

బెంగళూరు: ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల్లోని ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, బ్యూటీషియన్ వంటి వివిధ సేవల్లోని నిపుణులను గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ (GST) నెట్ వర్క్ కిందకు తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. డిపార్టుమెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) ఈ దిశగా అడుగులు వేస్తోంది.

UrbanClap, HouseJoy, Bro4u వంటి ఆన్‌లైన్ ఎంగేజ్ సర్వీస్ ప్రొఫెషనల్స్‌కు జీఎస్టీ నెంబర్ లేదా జీఎస్టీఎన్‌ను తప్పనిసరి చేయడాన్ని పరిశీలిస్తోంది. ఈ మేరకు సీనియర్ అధికారులు వెల్లడించినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వచ్చింది.

budget 2020: ATFపై పన్ను భారం తగ్గొచ్చు, ఒక సీసా విదేశీ మద్యమే కొనాలి!budget 2020: ATFపై పన్ను భారం తగ్గొచ్చు, ఒక సీసా విదేశీ మద్యమే కొనాలి!

ఆన్‌లైన్ మార్కెట్ ద్వారా ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, ఇండివిడ్యువల్ ఫిట్‌నెస్ ట్రెయినర్స్ వంటి వారు రూ.40 లక్షల లోపు ఆదాయాన్ని సంపాదించుకుంటారు. ఈ మేరకు జీఎస్టీ చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వడం అలాగే జీఎస్టీఎన్ తప్పనిసరి చేయడాన్ని పరిశీలిస్తుంది.

Gig economy workers may soon have to register under GSTN

ఈ రోజుల్లో ఎంతోమంది ప్రొఫెషనల్స్ వివిధ ఇళ్లల్లోకి వెళ్లి తమ తమ సేవలు అందిస్తుంటారని, వారిని గుర్తించేందుకు తమ వద్ద ప్రత్యేకమైన సదుపాయం ఏమీ లేదని సదరు అధికారి వెల్లడించారు.

వారు జీఎస్టీని చెల్లించవలసిన అవసరం లేదని, అలాగే క్వార్టర్లీ ఫైలింగ్ చేయవలసిన అవసరం లేదని, కానీ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు జీఎస్టీఎన్ ఇస్తే ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

వినియోగదారుల భద్రత, అలాగే కార్మికుల హక్కుల పరిరక్షణపై ఉన్న సమస్యల పరిష్కారం కోసం పరిశీలిస్తున్నామని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం స్వచ్చంధ జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉందని, కాబట్టి ఇది ఎవరికీ ఇబ్బందికర అంశం కాదని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఈ కామర్స్ విధానాలు ఈ ఆర్థిక సంవత్సరం లోపు వస్తాయని అంటున్నారు.

English summary

ఇక ప్లంబర్, బ్యూటీషియన్, ఎలక్ట్రీషియన్‌కు జీఎస్టీఎన్! | Gig economy workers may soon have to register under GSTN

The government is looking to get services professionals such as plumbers, electricians and beauticians listed on online platforms onto the Goods and Services Tax Network, in what could be yet another move to bring gig economy workers into the fold of the formal workforce.
Story first published: Monday, January 20, 2020, 17:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X