For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Free CIBIL: మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా CIBIL పడిపోతుంది.. మీ సిబిల్ స్కోర్ ఉచితంగా ఇలా చెక్ చేసుకోండి..

|

Free CIBIL Report: ఈ రోజుల్లో ప్రజలు తమ అవసరాలను తీర్చుకోవడానికి వివిధ ఫైనాన్స్ సాధనాలను, రుణాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటన్నిటికీ చాలా ముఖ్యమైనది ఏమిటంటే క్రెడిట్ స్కోర్ బాగుండటం. ఒక వ్యక్తికి లోన్స్ ఇవ్వాలా, వద్దా లేక తక్కువర రేటుకు ఇవ్వాలా లేక ఎక్కువ రేటుకు ఇవ్వాలా అనే అనేక అంశాలు సదరు వ్యక్తి CIBIL స్కోర్ పై ఆదారపడి ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ సిబిల్ స్కోర్ పై దృష్టి ఉంచాలి. ఎల్లప్పుడు క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా, పెరుగుతుందా అనేదానిపై ఒక కన్నేసి ఉంచాలి. మంచి CIBIL స్కోర్‌తో తక్కువ వడ్డీ రేట్లలో రుణాలు పొందవచ్చు కాబట్టి దీని గురుంచి ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి..?

క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి..?

CIBIL స్కోర్ 300 నుంచి 900 పాయింట్ల మధ్య ఉంటుంది. 750 పాయింట్లు లేదా అంత కంటే ఎక్కువ స్కోర్ ఉండటం మంచిదిగా పరిగణించబడుతుంది. అంటే.. 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే మీకు రుణాలు సులువుగా అందుతాయని గుర్తుంచుకోండి. CIBIL స్కోర్ 24 నెలల క్రెడిట్ చరిత్రపై ఆధారపడి ఉంటుంది. దీనిని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ అందిస్తున్న ఏకైక ఏజెన్సీ.

 మీ CIBIL ఎలా తెలుసుకోవాలి?

మీ CIBIL ఎలా తెలుసుకోవాలి?

Step 1- CIBIL వెబ్‌సైట్ www.cibil.com ని సందర్శించండి .

Step 2- హోమ్ పేజీలో మీ ఉచిత CIBIL స్కోర్‌పై క్లిక్ చేయండి.

Step 3- మీ పేరు ఈ-మెయిల్ ఐడిని నమోదు చేయండి. పాస్‌వర్డ్‌ను సృష్టించండి. దీని తర్వాత మీ ID ప్రూఫ్‌లో ఏదైనా (పాస్‌పోర్ట్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి నంబర్) ఎంచుకోండి. ఆపై మీ పిన్ కోడ్, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్‌ను నమోదు చేయండి.

Step 4- అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత.. అంగీకరించి కొనసాగించుపై క్లిక్ చేయండి.

Step 5- మీ ఫోన్‌లో అందుకున్న వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని నమోదు చేసి, కొనసాగించుపై క్లిక్ చేయండి.

Step 6- మీ నమోదు విజయవంతమైందనే సందేశాన్ని అందుకుంటారు. ఆపై వెబ్‌సైట్ డాష్‌బోర్డ్‌కి వెళ్లండి.

Step 7- దీంతో CIBIL స్కోర్ మీ ముందు అందుబాటులో ఉంటుంది.

CIBIL స్కోర్ దేనిపై ఆధారపడి ఉంటుంది? ఎలా లెక్కిస్తారు..

CIBIL స్కోర్ దేనిపై ఆధారపడి ఉంటుంది? ఎలా లెక్కిస్తారు..

30 శాతం CIBIL స్కోర్ మీరు సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లిస్తున్నారా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సెక్యూర్డ్ లేదా అన్‌సెక్యూర్డ్ లోన్‌లపై 25 శాతం, క్రెడిట్ ఎక్స్‌పోజర్‌పై 25 శాతం, రుణ వినియోగంపై 20 శాతం పరిగణలోకి తీసుకుని క్రెడిట్ స్కోర్ నిర్ధారిస్తారు.

ఈ కారణాల వల్ల CIBIL స్కోర్ తగ్గుతుంది..

ఈ కారణాల వల్ల CIBIL స్కోర్ తగ్గుతుంది..

మీరు బ్యాంకు నుంచి రుణం తీసుకుని, సకాలంలో చెల్లించకపోతే.. మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతిని తగ్గుతుంది. మీకు క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే దాని బిల్లులను సకాలంలో చెల్లించకపోతే కూడా క్రెడిట్ స్కోర్ ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. మీరు మీ బ్యాంక్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోయినా లేదా అందులో మైనస్ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.

English summary

Free CIBIL: మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా CIBIL పడిపోతుంది.. మీ సిబిల్ స్కోర్ ఉచితంగా ఇలా చెక్ చేసుకోండి.. | get your cibil report free through this easy steps and reasons that impact credit score negatively

get your cibil score report for free instantly in this way
Story first published: Thursday, June 30, 2022, 10:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X