For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

60 రోజుల్లో 50 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఎలాగంటే: నిర్మలమ్మకు అజీమ్ ప్రేమ్‌జీ

|

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయివేటు రంగాన్ని ఉపయోగించుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్‌జీ సూచించారు. ప్రయివేటు రంగాన్ని వినియోగిస్తే 50 కోట్లమందికి కేవలం రెండు నెలల్లోనే వ్యాక్సినేషన్ చేయవచ్చునని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ప్రయివేటు రంగాన్ని రంగంలోకి దింపాలని, అప్పుడు 60 రోజుల్లో 50 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయవచ్చునన్నారు.

బెంగళూరు చాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ ఇంటరాక్షన్ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్థికమంత్రికి సూచించారు. ప్రయివేటు భాగస్వామ్యం ద్వారా వ్యాక్సినేషన్ ధరపై కూడా ప్రభావం ఉంటుందన్నారు.
ప్రయివేటు సంస్థలకు రూ.300 చొప్పున టీకా ఇప్పిస్తే, మరో రూ.100 నర్సింగ్ హోం ఛార్జీతో కలిపి రూ.400కు ఒకరికి ఒక డోసు ఇవ్వడం సాధ్యమవుతుందన్నారు. ఈ విషయంలో కార్పొరేట్ సంస్థలకు భాగస్వామ్యం కల్పించాలన్నారు.

Get private companies in vaccine drive: Premji to finance minister

అజీమ్ ప్రేమ్‌జీ వర్క్ ఫ్రమ్ హోం మోడల్ గురించి కూడా మాట్లాడారు. దేశంలో 90 శాతానికి పైగా ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారని, భవిష్యత్తులోను కొంత కార్యాలయం-కొంత వర్క్ ఫ్రమ్ హోమ్ హైబ్రిడ్ విధానం కొనసాగుతుందన్నారు. కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన కొన్ని వారాల్లోపే 90 శాతానికి పైగా ఐటీ నిపుణులు ఇంటి నుంచే పని చేశారని, ఇది ఇప్పటికీ కొనసాగుతోందన్నారు.

కరోనా అనంతరం కూడా ఆఫీస్‌తో పాటు వర్క్ ఫ్రమ్ హోం విధానం శాశ్వతంగా ఉంటుందన్నారు. అనువైన సమయంలో పని చేయాలనుకునే మహిళలకు ఇది ప్రయోజనకరమన్నారు.

English summary

60 రోజుల్లో 50 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఎలాగంటే: నిర్మలమ్మకు అజీమ్ ప్రేమ్‌జీ | Get private companies in vaccine drive: Premji to finance minister

Wipro founder and philanthropist Azim Premji has urged Finance Minister Nirmala Sitharaman to engage the private sector and speed up the country’s Covid-19 vaccination effort. He said involving the private sector may help the country cover 50 crore vaccinations against Covid in just two months.
Story first published: Tuesday, March 2, 2021, 22:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X