For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనాకు షాక్, భారత్‌కు జర్మనీ షూ కంపెనీ: 10వేల ఉద్యోగాలు, ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే

|

కరోనా వైరస్ నేపథ్యంలో చైనా నుండి వందలాది కంపెనీలు ఇతర దేశాలకు తరలి వెళ్తున్నాయి. కొన్ని కంపెనీలు భారత్‌కు తరలి వస్తున్నాయి. తాజాగా జర్మనీకి చెందిన వోన్ వెలెక్స్ తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాకు తరలించింది. ఆగ్రాలో ఈ షూ కంపెనీ రెండు ఉత్పత్తి యూనిట్లను ప్రారంభించింది. జర్మనీ షూ కంపెనీ రావడం పట్ల మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర హర్షం వ్యక్తం చేశారు. జర్మనీ షూ కంపెనీ బ్రాండ్‌ను భారత్‌లోకి స్వాగతిస్తున్నామని, భారత్‌లో ఎన్నో అవకాశాలున్నాయన్నారు. ఈ పెట్టుబడి మార్గంగా, పెట్టుబడుల వరద వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చుక్కా చుక్కా వరద అవుతుందని, ఇన్వెస్ట్ ఇండియా పుంజుకుంటుందన్నారు.

దీపావళికి డబుల్ బొనాంజా, PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్?దీపావళికి డబుల్ బొనాంజా, PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్?

2 యూనిట్లు ప్రారంభం

2 యూనిట్లు ప్రారంభం

వోన్ వెలెక్స్ భార‌త్‌కు చెందిన ఇయాట్రిక్ ఇండ‌స్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్‌తో క‌లిసి ఆగ్రాలోని 2 యూనిట్ల‌లో త‌న ఉత్ప‌త్తుల‌ను ఈ వారం ప్రారంభించింది. తమ ఉత్పత్తి కార్యకలాపాలను చైనా నుండి భారత్‌కు తరలించనున్నట్లు మే నెలలో వోన్ వెలెక్స్ ప్రకటించింది. ఇప్పుడు భార‌త్‌లోని రెండు యూనిట్ల‌లో కార్యకలాపాలను ప్రారంభించింది. ఉత్తర ప్రదేశ్ మౌలిక స‌దుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధిశాఖ అద‌న‌పు ముఖ్య కార్య‌ద‌ర్శి అలోక్ వ‌ర్చువ‌ల్‌గా ఫుట్‌వేర్ యూనిట్ల‌ను ప్రారంభించారు.

వేలాదిమందికి ఉద్యోగాలు

వేలాదిమందికి ఉద్యోగాలు

ఎక్స్‌పోర్ట్ ప్ర‌మోష‌న్ ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్(EPIP)లో ఏర్పాటు చేసిన ఈ రెండు ఫుట్‌వేర్ ప్రొడ‌క్ష‌న్ యూనిట్లలో రెండువేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు క‌ల్పించారు. ఈ 2 యూనిట్లు క‌లిపి ఏడాదికి 25 ల‌క్ష‌ల జ‌త‌ల చెప్పులను త‌యారు చేసే సామ‌ర్థ్యం క‌లిగి ఉన్నాయి. వోన్ వెలెక్స్ యూపీలోని మూడు ప్రాజెక్టుల్లో విడుత‌ల వారీగా రూ.300 కోట్ల పెట్టుబ‌డులు పెట్టనుంది. ఈ పెట్టుబడులతో యూపీలో దాదాపు 10 వేల ఉద్యోగాలు రానున్నాయి. 2 యూనిట్ల‌లో ఏడాదికి 50 ల‌క్ష‌ల చెప్పుల ఉత్ప‌త్తిని ల‌క్ష్యంగా పెట్టుకుంది.

మరో రెండు యూనిట్లు

మరో రెండు యూనిట్లు

వోన్ వెలెక్స్ కంపెనీ వ‌చ్చే నెల‌లో జెవార్ స‌మీపంలో 10 వేల చ‌ద‌రపు అడుగుల విస్తీర్ణంలో మూడో కొత్త యూనిట్‌ను ప్రారంభించనుంది. మ‌ధుర‌లోని కోసి-కొట్వాన్ ప్రాంతంలో 7.5 ఎక‌రాల విస్తీర్ణంలో మరో యూనిట్ ప్రారంభించే ప్రతిపాదనలు ఉన్నాయి.

English summary

చైనాకు షాక్, భారత్‌కు జర్మనీ షూ కంపెనీ: 10వేల ఉద్యోగాలు, ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే | German shoe co. shifts manufacturing to Agra from China

Amid the ongoing COVID-19 pandemic, a German shoe brand, Von Wellx, recently shifted its manufacturing units to Agra, Uttar Pradesh, from China.
Story first published: Saturday, November 7, 2020, 8:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X