For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంచనాలకే అందలేదు: 1970 తర్వాత అత్యంత దారుణంగా దెబ్బతిన్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థ

|

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. కొద్ది వారాల క్రితం చైనా ఆర్థిక వ్యవస్థ కాస్త పుంజుకున్నట్లు కనిపించింది. రెండో క్వార్టర్‌లో అంచనాలకు మించి వృద్ధిని సాధించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కాస్త శుభవార్త చెప్పింది. కానీ కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు దారుణంగా పడిపోతున్నాయి. జర్మన్ వృద్ధి రేటు రెండో క్వార్టర్‌లో దశాబ్దాల కనిష్టానికి పడిపోయింది. యూరోపియన్‌లో జర్మనీది బిగ్గెస్ట్ ఎకానమీ.

హైదరాబాద్‌లో భారీగా తగ్గిన హౌసింగ్ సేల్స్, ధరలు ఎలా ఉన్నాయంటే?హైదరాబాద్‌లో భారీగా తగ్గిన హౌసింగ్ సేల్స్, ధరలు ఎలా ఉన్నాయంటే?

1970 తర్వాత దారుణ వృద్ధి

1970 తర్వాత దారుణ వృద్ధి

జర్మనీ ఆర్థిక వ్యవస్థ రెండో క్వార్టర్‌లో (జూన్) 10.1 శాతం క్షీణించింది. 1970 తర్వాత అత్యంత చెత్త రికార్డ్ ఇదే కావడం గమనార్హం. కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బతో పదేళ్ల ఆర్థిక వ్యవస్థ తుడిచిపెట్టుకుపోయిందని అంచనా. ఇక జూలై నెలలో నిరుద్యోగిత రేటు ఊహించని విధంగా పెరుగుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా దారుణంగా పతనమవుతుందని అంచనాలు ఉన్నాయి.

2009 కంటే దారుణం

2009 కంటే దారుణం

ఫెడరల్ లేబర్ ఆఫీస్ డేటా ప్రకారం జర్మనీలో నిరుద్యోగిత రేటు జూలై నెలలో 6.4 శాతంగా ఉంది. జర్మనీ పదేళ్ళ ఆర్థిక వ్యవస్థ తుడిచిపెట్టుకుపోయినట్లు దేనా బ్యాంకు ఎకనమిస్ట్ ఆండ్రేస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాల క్రితం క్వార్టర్ జీడీపీ ప్రారంభమైనప్పటి నుండి దారుణ పతనం ఇదే అంటున్నారు. 2009లో 4వ క్వార్టర్‌లో మైనస్ 4.7 శాతానికి మించి ప్రతికూలత నమోదు చేసిందని చెబుతున్నారు.

అంచనాల కంటే దారుణంగా పడిపోయింది

అంచనాల కంటే దారుణంగా పడిపోయింది

ఎగుమతులు, దిగుమతులు భారీగా పడిపోయాయని, గృహ వినియోగం తగ్గిపోయిందని చెబుతున్నారు. జర్మనీ జీడీపీ రెండో క్వార్టర్‌లో అంచనాల కంటే ఎక్కువగా పడిపోయింది. ఆర్థికవేత్తలు 9 శాతం క్షీణతను అంచనా వేశారు. కానీ 10.1 శాతం ప్రతికూలత నమోదు చేసింది. వృద్ధి దారుణంగా పడిపోవడంతో జర్మనీ స్టాక్ మార్కెట్లో డాక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 1 శాతానికి పైగా పడిపోయింది. యూరోపియన్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన ఫ్రాన్స్ CAC 0.5 శాతం, ఇటలీ FTSE MiB 0.9 శాతం, స్పెయిన్ Ibex 1.6 శాతం నష్టపోయాయి.

English summary

అంచనాలకే అందలేదు: 1970 తర్వాత అత్యంత దారుణంగా దెబ్బతిన్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థ | German economy in sharpest decline since 1970

Germany, Europe’s biggest economy, shrank by 10.1% in the three months to June, the worst decline since records began in 1970. It wiped out nearly 10 years of economic growth. On a brighter note, unemployment fell unexpectedly in July.
Story first published: Friday, July 31, 2020, 10:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X