For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్తులను రిలయన్స్‌కు విక్రయించరాదన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తాం: కిషోర్ బియానీ

|

న్యూఢిల్లీ: ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ఆస్తులను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయించరాదంటూ అమెజాన్ సంస్థ వేసిన పిటిషన్‌కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తామని ఫ్యూచర్ గ్రూప్ వెల్లడించింది. బుధవారం రోజున పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

స్టేటస్ కో మెయిన్‌టెయిన్ చేయాలన్న ఢిల్లీ హైకోర్టు

స్టేటస్ కో మెయిన్‌టెయిన్ చేయాలన్న ఢిల్లీ హైకోర్టు

ఫ్యూచర్ గ్రూప్‌నకు సంబంధించి అప్పుల్లో ఉన్న ఆస్తులను విక్రయించరాదని చెబుతూ ఇటు ఫ్యూచర్ గ్రూప్‌కు అటు భారత అధికార యంత్రాంగానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు ఆస్తులు ఎలా అయితే ఉన్నాయో అలానే ఉంచాలని ఆదేశించింది. మొత్తం రూ.24,713 కోట్లు విలువ చేసే ఆస్తులను ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌కు విక్రయించాలని ఫ్యూచర్ గ్రూప్ భావించింది. తదుపరి ఆదేశాల ఇచ్చేవరకు స్టేటస్ కో మెయిన్‌టెయిన్ చేయాలని స్పష్టం చేసింది.

హైకోర్టును ఆశ్రయించిన అమెజాన్

హైకోర్టును ఆశ్రయించిన అమెజాన్

ఫ్యూచర్ గ్రూప్ ఆస్తుల అమ్మకాలకు బ్రేక్ వేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో గతవారం ఎమర్జెన్సీ పద్ధతిన అమెజాన్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు ట్రైబ్యునల్ ఆదేశాలను అతిక్రమిస్తూ ఆస్తులను అమ్మాలని చూసిన ఫ్యూచర్ గ్రూప్ సంస్థ యాజమాన్యంను అరెస్టు చేయాలని ఆ గ్రూప్ ప్రమోటర్‌ కిషోర్ బియానీని కూడా అరెస్టు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పెట్టుబడుల ఒప్పందాలను ఫ్యూచర్ గ్రూప్ ఉల్లంఘించిందని ట్రైబ్యునల్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది అమెజాన్ సంస్థ.

 హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తాం

హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తాం

అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా గతేడాది అక్టోబరులో ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి క్రయవిక్రయాలు చేపట్టరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక ఇదే అంశాన్ని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. దీంతో ఫ్యూచర్ రీటెయిల్ సంస్థ న్యాయపరమైన మార్గాల కోసం అన్వేషిస్తోంది. చిక్కులన్నీఅధిగమించి తిరిగి ఆస్తులను అమ్మకానికి పెట్టాలని భావిస్తోంది. ఈ విషయాన్ని మంగళవారం తమ ఫైలింగ్‌లో వెల్లడించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హర్షం వ్యక్తం చేస్తూ మెయిల్ చేసింది అమెజాన్ సంస్థ.

ఇదిలా ఉంటే ఫ్యూచర్ - రిలయన్స్ డీల్‌కు గతేడాది నవంబర్‌లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఇక గత నెలలో ఈ ఒప్పందానికి షరతులతో కూడిన ఆమోదం తెలిపింది సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.

English summary

ఆస్తులను రిలయన్స్‌కు విక్రయించరాదన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తాం: కిషోర్ బియానీ | Future Group-Reliance deal:We will challenge the Delhi high court order,says Kishore biyani

Future Group will challenge the Delhi high court order that has halted sale of its to Reliance Industries Ltd (RIL) on objections retail giant Amazon.com.
Story first published: Wednesday, February 3, 2021, 12:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X