For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘రెంటింగ్ కల్చర్’కు అలవాటుపడుతున్న మిలీనియల్స్!

|

అసలే టెక్కీలు. ఉద్యోగరీత్యా సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్.. తిరగక తప్పని పరిస్థితి. ఎక్కడికెళితే అక్కడ.. ఉన్నన్ని రోజులూ ఓ చక్కటి ఫ్లాట్. తిరగడానికి కారు, ఇంటి నిండా ఫర్నిచర్, లివింగ్ రూమ్‌లో హైడెఫినిషన్ టీవీ, ఫ్రిజ్, బెడ్‌రూమ్‌లో స్ప్లిట్ ఏసీ, బాల్కానీలో వాషింగ్ మిషన్, కిచెన్‌లో మైక్రోవేవ్ ఓవెన్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏదీ తక్కువ కాదు, ఇవేవీ డబ్బులు పెట్టి కొన్నవీ కావు.

అవునా, కొనకుండానే ఇవన్నీ ఎలా వచ్చాయబ్బా.. అని ఆశ్చర్యపోతున్నారా? అన్నీ రెంట్‌కి తీసుకొచ్చినవండీ బాబూ. ఊరుకాని ఊరిలో ఇల్లే అద్దెకు తీసుకుంటుంటే.. మళ్లీ బోలెడు డబ్బులు పోసి ఆ ఇంట్లోకి అవసరమైన ఈ సామాన్లు అన్నీ కొనడానికి వాళ్లేమైనా వెంగళప్పలా? కాదు, కాదు.. మిలీనియల్స్!

ఎవరీ మిలీనియల్స్?

ఎవరీ మిలీనియల్స్?

1981-1996 మధ్య జన్మించిన వారిని ‘మిలీనియల్స్' అని పిలుస్తున్నారు. వీళ్లు స్వేచ్ఛాజీవులు. వీళ్ల థింకింగే డిఫరెంట్. పెళ్లయితే ఫ్యామిలీ, పిల్లలు.. ఆ జంజాటం ఎలాగూ తప్పదు. వాళ్ల కోసం అవీ, ఇవీ కొనకా తప్పదు. ఇప్పుడెందుకు అవన్నీ.. ప్రతి వస్తువూ అద్దెకు లభిస్తుండగా.. అనుకుంటుంటారు. అనుకోవడమేకాదు, వాళ్లకు ఏది కావాలంటే అది ఐఫోన్ నుంచి లాప్‌టాప్, కంప్యూటర్ టేబుల్ వరకు, ఫ్రిజ్ నుంచి వాషింగ్ మిషన్, మైక్రోవేవ్ ఓవెన్ వరకు.. అన్నీ అద్దెకు తెచ్చుకోవడం.. వాడేయడం.. అంతే!

కొనడం ఎందుకు దండగ?

కొనడం ఎందుకు దండగ?

‘‘అసలే సాఫ్ట్‌వేర్ జాబ్. ఉద్యోగరీత్యా ఎప్పుడు దేశంలో ఏ నగరానికి వెళ్లి ఉండాల్సి వస్తుందో తెలియదు. ఇంటి నిండా సామాను కొనుక్కుంటే.. దేశంలో ఎక్కడికెళ్లినా మళ్లీ ఆ సామానంతా మోసుకెళ్లాలి.. అందుకే ఎందుకొచ్చిన గొడవ? కొనడం ఎందుకు, మోసుకెళ్లడం ఎందుకు? ఏది కావాలంటే అది అద్దెకు తెచ్చేసుకుంటే సరి..'' ఇదీ హైదరాబాద్ నుంచి ఇటీవల ముంబైకి వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తోన్న అభినవ్ శర్మ ఆలోచన. వయసు 28 ఏళ్లు. మనోడిది అంతా ఆధునిక పోకడ. అవసరమైన వస్తువులన్నీ కొని తను నివసిస్తోన్న ఫ్లాట్‌లో నింపేయడం అభినవ్‌కి ఏమాత్రం నచ్చదు.

‘‘వారికి ఈ కాన్సెప్ట్ అర్థం కావడం లేదు..’’

‘‘వారికి ఈ కాన్సెప్ట్ అర్థం కావడం లేదు..’’

ఈ అద్దెకు తెచ్చుకోవడం ఏమిటి అని అడిగితే.. ‘‘నా కాన్సెప్ట్ మా అమ్మానాన్నలకే అర్థం కావడం లేదు. ప్రతిదీ అద్దెకు తెచ్చుకోవడం ఏమిటని వారు విస్తుపోతుంటారు. చూడండి.. నేనిక్కడ ముంబైలో ఒక్కడినే ఉంటున్నాను. నా ఫ్లాట్‌లోని లివింగ్ రూమ్, బెడ్ రూమ్, డైనింగ్ ఏరియా, కిచెన్‌కు అవసరమైన ఫర్నిచర్, టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్ ఓవెన్.. అన్నీ అద్దెకు తెచ్చుకున్నవే. వీటన్నింటికీ నేను ప్రతి నెలా రూ.4,247 చెల్లిస్తున్నా.. అంతే! ఇవన్నీ కొనాలంటే ఎంతవుతుందో ఆలోచించండి.. మళ్లీ వాటి మరమ్మతు ఖర్చులు కూడా వేసుకోండి.. దానికంటే ఇది బెటర్ కదూ..'' అని అభినవ్ శర్మ నవ్వేస్తుంటాడు.

పెరుగుతోన్న ‘రెంటింగ్ కల్చర్’...

పెరుగుతోన్న ‘రెంటింగ్ కల్చర్’...

అభినవ్ శర్మకు మాదిరే మన దేశంలోని మిలీనియల్స్ రెంటింగ్ కల్చర్‌కు అలవాటు పడుతున్నారు. అవసరమైన గృహోపకరణాలన్నీ తక్కువ ధరలకే అద్దెకు లభిస్తుండడం, ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ తీసుకునే వీలుండడం, నచ్చని వస్తువు వాపస్ ఇచ్చేసే అవకాశం ఉండడంతో ఇప్పుడు చాలామంది అద్దె విధానంలో అవసరమైన వస్తువులు సమకూర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని వల్ల లాభం ఏమిటంటే.. ఉద్యోగరీత్యా హఠాత్తుగా ఉంటున్న ప్రాంతాన్ని వదిలి మరో ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే.. పెద్దగా ఇబ్బంది పడనక్కర్లేదు. అద్దెకు తీసుకొచ్చిన వస్తువులన్నింటికి రెంట్ చెల్లించి, వాపస్ చేస్తే సరి. జస్ట్.. దుస్తులు, ముఖ్యమైన ఇతర వస్తువులు తీసుకుని మరో ప్రాంతానికి షిప్ట్ అయిపోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోన్న ట్రెండ్...

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోన్న ట్రెండ్...

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ రెంటింగ్ కల్చర్ విస్తరిస్తోంది. అమెరికాలో రెంట్ ది రన్‌వే, న్యూలీ వంటి సంస్థలు దుస్తులను కూడా అద్దెకు ఇస్తున్నాయి. ఇక చైనాలో అయితే స్మార్ట్‌ఫోన్‌పై బీఎండబ్ల్యూ కారును కూడా అద్దెకు తీసుకోవచ్చు. మన ఇండియాలో రెంటోమోజో, గ్రాబ్ ఆన్ రెంట్, ఫర్లెంకో వంటి సంస్థలు గృహోపకరణాలు అద్దెకు ఇస్తున్నాయి. అంటే.. ఫర్నిచర్, టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్ ఓవెన్, జిమ్ సామగ్రి, ఐఫోన్లు, గూగుల్ హోమ్ వంటి వస్తువులను అద్దెకు ఇస్తాయన్నమాట. ఇవే కాదు, మహిళల కోసం నగలను అద్దకు ఇచ్చే యాప్స్ కూడా కొన్ని ఉన్నాయంటే మారిన పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు.

 2025 నాటికి భారీ వృద్ధి దిశగా...

2025 నాటికి భారీ వృద్ధి దిశగా...

మన దేశంలో ఫర్నిచర్ రెంటింగ్ మార్కెట్ 2025 నాటికి 1.89 బిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.13,561 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే వచ్చే 30 నెలల్లో ఆర్డర్లు పది లక్షలకుపైగా పెరుగుతాయని ఆశిస్తున్నట్లు రెంటోమోజో ఫౌండర్ గీతాంశ్ బమానియా తెలిపారు. ‘‘నేడు మార్కెట్‌లోకి రోజుకో స్మార్ట్‌ఫోన్ విడుదలవుతోంది. అందుకే మిలీనియల్స్ స్మార్ట్‌ఫోన్లను కొనడం కంటే అద్దెకు తీసుకోవడమే బెటర్ అని భావిస్తున్నారు. వాళ్ల వద్ద ఉన్నది పాతది అనిపించగానే దాన్ని వాపస్ ఇచ్చేసి కొత్త మోడల్ అద్దెకు తీసుకుంటున్నారు..'' అని ఆయన వివరించారు. వచ్చే ఏడాదిలోపు 30 మార్కెట్లలో ఫర్నిచర్ రెంట్ సేవలను ప్రారంభిస్తామని స్వీడన్‌ కంపెనీ ఐకియా ప్రకటించిందంటే.. ట్రెండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Read more about: furniture ikea ఐకియా
English summary

‘రెంటింగ్ కల్చర్’కు అలవాటుపడుతున్న మిలీనియల్స్! | From iPhones to washing machines, India's millennials rent it all

At 28, Abhinav Sharma doesn't own a flat, a car, or even a chair -- one of a growing number of Indian millennials bucking traditional norms and instead opting to rent everything from furniture to iPhones.
Story first published: Friday, December 6, 2019, 8:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X