For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుమ్ము దులిపిన బ్యాంక్స్.. వీటి లాభాలు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ఎంత డబ్బో..

|

Bank News: డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను కంపెనీలు విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్ రంగంలోని కంపెనీలు సైతం తమ ఫలితాలను విడుదల చేస్తున్నాయి. వీటిలో కొన్నింటి లాభాలను చూస్తే నిజంగా కళ్లు తిరుగుతాయి.

ICICI బ్యాంక్..

ICICI బ్యాంక్..

దేశంలోని ప్రముఖ ప్రైవేటు రంగంలోని బ్యాంక్ ఐసీఐసీఐ. ఇది ఇటీవల తన క్యూ-3 ఫలితాను విడుదల చేసింది. బ్యాంక్ అందించిన వివరాల ప్రకారం పన్నుల తర్వాత లాభం 34.2% పెరిగి రూ.8,312 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో నాన్-పెర్ఫార్మింగ్ లోన్ నిష్పత్తి 0.55 శాతాకి తగ్గింది. ఈ నిష్పత్తి అంతకు ముందర సెప్టెంబర్ త్రైమాసికంలో 0.61 శాతంగా ఉంది.

వడ్డీ ఆదాయం..

వడ్డీ ఆదాయం..

ఐసీఐసీఐ నికర వడ్డీ ఆదాయ నిష్పత్తి 34.6% పెరిగి రూ.16,465 కోట్లకు చేరుకుంది. వడ్డీ మార్జిన్ నిష్పత్తి డిసెంబర్ త్రైమాసికంలో 4.65 శాతానికి పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో వడ్డీ మార్జిన్ నిష్పత్తి 3.96 శాతంగా ఉంది.

కోటక్ బ్యాంక్..

కోటక్ బ్యాంక్..

ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలోని కోటక్ బ్యాంక్ సైతం మంచి వృద్ధిని నమోదు చేసింది. మార్జిన్ నిష్పత్తి బహుళ సంవత్సరాల గరిష్ఠ స్థాయి 5.47 శాతానికి చేరుకుంది. అదే నికర రాబడి నిష్పత్తి 31 శాతం పెరిగి రూ.2,792 కోట్లకు చేరుకుంది. గతేడాది బ్యాంక్ ఇదే కాలంలో రూ.2,131 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

పంజాబ్ & సింధ్ బ్యాంక్..

పంజాబ్ & సింధ్ బ్యాంక్..

ప్రభుత్వ రంగంలోని పంజాబ్ & సింధ్ బ్యాంక్ లాభం 24% పెరిగి రూ.373 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో బ్యాంక్ బలమైన వృద్ధిని సాధించిందనే చెప్పుకోవాలి. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం వృద్ధి రేటు సైతం పెరగటం శుభసూచికమని చెప్పుకోవాలి. అలాగే ఈ కాలంలో మొండి బకాయిల నిష్పత్తి తగ్గుముఖం పట్టింది.

IDFC ఫస్ట్ బ్యాంక్

IDFC ఫస్ట్ బ్యాంక్

డిసెంబర్ త్రైమాసికంలో ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ నికర లాభం రెండింతలు పెరిగి రూ.605 కోట్లకు చేరుకుంది. లైక్-ఫర్-లైక్ ఆపరేటింగ్ ఆదాయ నిష్పత్తి రూ. 281 కోట్లుగా ఉంది. బ్యాంక్ గత ఏడాది ఇదే కాలంలో కేవలం రూ.281 కోట్ల లాభాన్ని మాత్రమే నమోదు చేసింది.

YES బ్యాంక్..

YES బ్యాంక్..

యెస్ బ్యాంక్ మాత్రం మూడో త్రైమాసికంలో పేలవమైన పనితీరును కనబరిచింది. శనివారం విడుదల చేసిన ఫలితాల్లో బ్యాంక్ నికర లాభం 80 శాతం క్షీణించింది. దీంతో క్యూ-3లో బ్యాంక్ కేవలం రూ.52 కోట్ల లాభాన్ని మాత్రమే నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ ఏకంగా రూ.266.43 కోట్ల నికల లాభాన్ని నమోదు చేసింది. ఇన్వెస్టర్లు, మార్కెట్ వర్గాలు సైతం బ్యాంక్ విడుదల చేసిన ఫలితాలతో నిరాశ చెందారు.

Read more about: bank news icici yes bank idfc bank
English summary

దుమ్ము దులిపిన బ్యాంక్స్.. వీటి లాభాలు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ఎంత డబ్బో.. | From ICICI to YES bank know Q3 profits released by them in detail

From ICICI to YES bank know Q3 profits released by them in detail
Story first published: Sunday, January 22, 2023, 17:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X