For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫోర్బ్స్ రిపోర్ట్: జోకర్ అదుర్స్... రూ.450 కోట్లతో సినిమా, రూ.7,000 కోట్ల చేరువలో కలెక్షన్స్

|

హాలీవుడ్ సినిమా జోకర్ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు సాధించింది. ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చింది. అందరి అంచనాలు మించి రికార్డ్స్ తిరగరాస్తోంది. జోక్వీన్ ఫోనిక్స్ అద్భుత నటన జోకర్‌ను విజయపథంలో నడిపించింది. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులతోపాటు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గత ఐదువారాల్లో ప్రపంచ రికార్డును తిరగరాసే కలెక్షన్లు రాబట్టింది. టెర్మినేటర్:డార్క్ ఫేట్ ఆశించినంతగా కలెక్షన్లు రాబట్టలేదు. జోకర్‌కు మాత్రం తిరుగులేకుండా పోయింది.

ఇండియాలో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు

ఇండియాలో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు

ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం జోకర్ సినిమా భారత్‌లో కూడా భారీ వసూళ్లు సాధించింది. అక్టోబర్ 2వ తేదీన రిలీజైన ఈ చిత్రం బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలకు ధీటుగా రికార్డు వసూళ్లు సాధించింది. అదే రోజున రిలీజైన వార్, స్కై ఈజ్ పింక్ అనే చిత్రాలకు మించి కలెక్షన్లను సాధించడం గమనార్హం. మొత్తంగా భారతీయ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది.

రూ.6,816 కోట్లు వసూళ్లు

రూ.6,816 కోట్లు వసూళ్లు

ప్రపంచ బాక్సాఫీస్ వద్ద జోకర్ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటి వరకు రిలీజైన కామెడీ నేపథ్యం ఉన్న చిత్రాల్లో జోకర్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 953 మిలియన్ల డాలర్లు (రూ.6816.5 కోట్లు) వసూలు చేసింది. ఈ సినిమా 1 బిలియన్ డాలర్లకు సమీపంలో ఉంది.

బడ్జెట్ కంటే 15 రెట్ల కలెక్షన్లు

బడ్జెట్ కంటే 15 రెట్ల కలెక్షన్లు

ఈ సినిమా 62.5 మిలియన్ డాలర్ల (రూ.446.1 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కించారు. కానీ ఆదాయం మాత్రం పదిహేను రెట్లకు పైగా వచ్చింది. తక్కువ బడ్జెట్‌తో నిర్మించి ప్రపంచ బాక్సాఫీస్‌ను శాసించిన చిత్రాల్లో ది మాస్క్ టాప్‌గా నిలిచింది.

బడ్జెట్ తక్కువ.. కలెక్షన్లు ఎక్కువ..

బడ్జెట్ తక్కువ.. కలెక్షన్లు ఎక్కువ..

23 మిలియన్ డాలర్లతో ది మాస్క్ చిత్రం రూపొందింతే 351 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. వెనొమ్ 90 మిలియన్ డాలర్లతో తెరకెక్కగా 854 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. బ్యాట్‌మన్ చిత్రాన్ని 35 మిలియన్ డాలర్లతో నిర్మిస్తే 411 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. డెడ్ పూల్ సినిమా 58 మిలియన్ డాలర్లతో నిర్మించగా 783 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని ఫోర్బ్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

జోకర్

జోకర్

ఇక, టెర్మినేటర్: డార్క్ ఫేట్ సినిమా నార్త్ అమెరికా సహా పలుచోట్ల ఆశించిన కలెక్షన్లు వసూలు చేయలేదు. కాగా, జోకర్ చిత్రంలో జోక్విన్ ఫొనిక్స్ నటనతోపాటు రాబర్ట్ డీ నీరో, జాజీ బీట్జ్ లాంటి దిగ్గజ నటుల పాత్రలు ప్రేక్షకులను విశేషంగా ఆలరించాయి. ఈ చిత్రంలో నటించిన యాక్టర్ల ఫెర్ఫార్మెన్స్ ఆస్కార్ స్థాయిలో ఉన్నాయంటూ విదేశీ మీడియా ప్రశంసలతో ముంచెత్తింది. హాస్యం, భావోద్వేగం లాంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో కాసుల పంట పడింది. జోకర్ చిత్రానికి టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించారు.

English summary

ఫోర్బ్స్ రిపోర్ట్: జోకర్ అదుర్స్... రూ.450 కోట్లతో సినిమా, రూ.7,000 కోట్ల చేరువలో కలెక్షన్స్ | Friday Box Office: Terminator: Dark Fate Plunges 73 percent As Joker Nears $1 Billion

Even with better reviews, a stronger fan reception and a decent B+ Cinemascore grade, Terminator: Dark Fate met Judgment Day on Friday. The $185 million Paramount/Disney/Fox release earned just $2.8 million (-73%) on Friday to set the stage for a $10.21 million (-65%) second-weekend gross.
Story first published: Monday, November 11, 2019, 8:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X