For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మస్క్ వ్యాఖ్య, చైనా నిర్ణయం ఎఫెక్ట్: బిట్ కాయిన్ సహా క్రిప్టో మహాపతనం, హెల్దీ కరెక్షన్

|

క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ వ్యాల్యూ దారుణంగా పతనమైంది. గత నెలలో ఓ సమయంలో 64వేల డాలర్ల పైకి చేరిన ఈ క్రిప్టో ఇప్పుడు ఏకంగా 37,000 డాలర్ల స్థాయికి పడిపోయింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు, క్రిప్టో కరెన్సీకి బ్యాంకింగ్ సేవలను చైనా నిలిపివేయడం వంటి వివిధ కారణాలతో బిట్ కాయిన్ పడిపోయింది. బిట్ కాయిన్ దాదాపు సగం పడిపోయిందని చెప్పవచ్చు. మిగిలిన క్రిప్టోకరెన్సీలకు కూడా ప్రాధాన్యత తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. బిట్ కాయిన్‌ను పసిడికి ప్రత్యామ్నాయంగా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇది 65వేల డాలర్ల నుండి 37వేల డాలర్లకు పడిపోయింది.

ఐటీలో ఉద్యోగాలు: క్రెడిట్ సూస్‌లో 1000కి పైగా డెవలపర్స్, ఇంజినీర్ ఉద్యోగాలుఐటీలో ఉద్యోగాలు: క్రెడిట్ సూస్‌లో 1000కి పైగా డెవలపర్స్, ఇంజినీర్ ఉద్యోగాలు

క్రిప్టో పతనం

క్రిప్టో పతనం

బిట్ కాయిన్ గడిచిన 24 గంటల్లో 35 శాతం పతనమై 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇది పద్నాలుగు నెలల కనిష్టం. బుధవారం ఇంట్రాడేలో 29,563 డాలర్ల కనిష్టస్థాయిని నమోదు చేసిన బిట్ కాయిన్, ఆ తర్వాత షార్ట్ కవరింగ్ కారణంగా కొంతమేరకు కోలుకుంది. మరో క్రిప్టోకరెన్సీ ఎథేరియం కూడా గత 24 గంటల్లో 40 శాతం 1818 డాలర్లకు పడిపోయింది. తక్కువ విలువగల బిట్ కాయిన్లలో డొజేకాయిన్ 0.21 డాలర్ల వద్దకు క్షీణించింది.

అందుకే కుప్పకూలింది

అందుకే కుప్పకూలింది

క్రిప్టోకరెన్సీ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన సేవలను బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు అందించడాన్ని చైనా నిషేధిస్తున్నట్లు మంగళవారం తెలిపింది. దీంతో ఈ పతనం కనిపించింది. ఏడాది కాలంగా ర్యాలీ చేసిన బిట్ కాయిన్ ఇప్పుడు అదే విధంగా కుప్పకూలింది. బిట్ కాయిన్‌కు వాస్తవ విలువ లేదని, ఇది కరెన్సీయే కాదని, చెల్లింపులకు మారకం కాదని అమెరికా ఆర్థికవేత్తలు అంటున్నారు. క్రిప్టోకరెన్సీలో ప్రస్తుతం హెల్తీ కరెక్షన్ కొనసాగుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

మార్కెట్ వ్యాల్యూ పతనం

మార్కెట్ వ్యాల్యూ పతనం

ఈ పతనంతో క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 600 బిలియన్ డాలర్ల మేర పడిపోయింది. సంస్థాగత ఇన్వెస్టర్లు ఆసక్తి కనపర్చడంతో ఏప్రిల్ నెలలో మొత్తం క్రిప్టోకరెన్సీల వ్యాల్యూ మొదటిసారి 2 ట్రిలియన్ డాలర్లను దాటింది. కేవలం రెండు నెలల్లో వాటి విలువ రెట్టింపు అయింది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ వ్యాల్యూ లక్ష కోట్ల డాలర్లకు క్షీణించింది.

English summary

మస్క్ వ్యాఖ్య, చైనా నిర్ణయం ఎఫెక్ట్: బిట్ కాయిన్ సహా క్రిప్టో మహాపతనం, హెల్దీ కరెక్షన్ | Fretting over 40 percent crash in Bitcoin, Experts say it's a healthy correction

In one of the craziest trades, world's best-known cryptocurrency Bitcoin nosedived as much as 31 percent to $30,201.96 (over the past 24 hours) on May 19, sending shockwaves through the financial world. Other cryptos such as Ethereum, Dogecoin too were in a free fall.
Story first published: Thursday, May 20, 2021, 8:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X