For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా ఆహారం.. ఎందుకంటే..

|

Indian Railways: భారతీయ రైల్వేలు సమయానికి ప్రయాణించటం అనేది సాధారణమైన విషయం కాదు. అనేక సార్లు రైళ్లు కేటాయించిన సమయం కంటే ఆలస్యంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి. ఇలాంటి సందర్భంలో రైల్వే కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది.

ఉచితంగా ఆహారం..

ఉచితంగా ఆహారం..

భారతీయ రైల్వేలోని రాజధాని, శతాబ్ది, దురంతో ప్రయాణీకులకు ఉచిత ఆహారాన్ని అందించనుంది. ఇందులో భాగంగా శాఖాహారం, మాంసాహార భోజనాల ఎంపికలను కూడా అందిస్తోంది. అయితే ఉచిత భోజనం పొందటానికి ఒక మెలిక ఉంది. అదేంటంటే.. రైలు రెండు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే మాత్రమే భారతీయ రైల్వే ఉచిత భోజనాన్ని ప్రయాణికులకు అందిస్తుంది.

ఆలస్యానికి కారణం..

ఆలస్యానికి కారణం..

ఏ కారణం వల్లనైనా రైలు రెండు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు రైల్వే సంస్థ ప్రకటించింది. ఇందుకోసం కారణంతో పట్టింపు లేదని తెలిపింది. ఇవి ప్రీమియం రైళ్లు కాబట్టి, ఉచిత భోజనం తరచుగా అందించే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లలో ఫుడ్ సర్వీస్ డిసెంబరు 21న ఇప్పటికే పునఃప్రారంభమైంది.

IRCTC భోజనం నాణ్యతను మెరుగుపరుస్తుందా..?

IRCTC భోజనం నాణ్యతను మెరుగుపరుస్తుందా..?

ప్రయాణీకులకు అందించే భోజనం నాణ్యతను మెరుగుపరచడానికి, ఆన్‌బోర్డ్ మెనూలు పునరుద్ధరించబడ్డాయి. భోజన ట్రేలు ఇప్పుడు బయోడిగ్రేడబుల్ మెటీరియల్‌తో తయారయ్యాయి. ఎయిర్ టైట్ ప్యాకింగ్.. ఇప్పుడు ఎంపిక చేసిన రాజధాని, దురంతో రైళ్లలో అందుబాటులో ఉన్నాయి. కరోనా మహమ్మారి సమయంలో భద్రతా చర్యగా రైళ్లలో వండిన భోజన సేవలను నిలిపివేసిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త వంటశాలలను నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

IRCTCలో ఆహారాన్ని ఎలా ఆర్డర్ చేయాలి..?

IRCTCలో ఆహారాన్ని ఎలా ఆర్డర్ చేయాలి..?

* IRCTC eCatering అధికారిక వెబ్‌సైట్ https://www.ecatering.irctc.co.in/ లాగిన్ అవ్వాలి.

* ప్రయాణికులు తమ పది అంకెల PNR నంబర్‌ని నమోదు చేసి.. కొనసాగింపు ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

* కేఫ్‌లు, అవుట్‌లెట్లు, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల లిస్ట్ నుంచి ఆహారాన్ని ఎంచుకోండి.

* ఆర్డర్ చేసి, ఆన్‌లైన్‌లో చెల్లించండి లేదా క్యాష్ ఆన్ డెలివరీ చేసే చెల్లింపు విధానాన్ని ఎంచుకోవచ్చు.

* ఆర్డర్ చేసిన తర్వాత, ఆహారం మీ సీటు/బెర్త్‌కు డెలివరీ చేయబడుతుంది.

English summary

Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా ఆహారం.. ఎందుకంటే.. | free food offering by indian railways in Rajdhani, Shatabdi, Duronto trains if they are late

free food offering by indian railways in Rajdhanis, Shatabdis, Duronto trains if they are late
Story first published: Monday, September 19, 2022, 13:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X