For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరుసగా రెండో నెల తరలిపోయిన FPI: మార్చిలో రూ.1 లక్ష కోట్లు, ఏప్రిల్‌లో రూ.15,403 కోట్లు

|

ఫారెన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్ట్‌మెంట్స్(FPI) వెనక్కి పోతున్నాయి. వరుసగా రెండో నెల ఏప్రిల్‌లోను వెనక్కి పోయాయి. గత నెలలో భారత మూలధన మార్కెట్ల నుండి రూ.15,403 కోట్ల రూపాయల నికర మొత్తం ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీ డేటా ప్రకారం ఈక్విటీల నుండి రూ.6,884 కోట్లు, డెట్ నుండి రూ.8,519 కోట్లు వెనక్కి తరలి పోయాయి. మొత్తంగా రూ.15,403 కోట్లు తరలి పోయాయి.

అంతకుముందు మార్చి నెలలో ఈక్విటీ, డెట్ నుండి నికర ప్రాతిపదికన రికార్డ్ స్థాయిలో రూ.1.1 లక్షల కోట్లు వెనక్కి తరలిపోయాయి. ఇండియాలోకి వస్తున్న ఎఫ్‌పీఐలలో ఫార్మా, ఎన్బీఎఫ్‌సీలే ఎక్కువ అని చెబుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ, దేశీయ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఈ నేపథ్యంలో ఔట్ ప్లో గత రెండు నెలలుగా పెరుగుతోంది.

చరిత్రలో తొలిసారి 'జీరో', ఆటో పరిశ్రమకు రూ.1 కోట్లకు పైగా నష్టం: ప్రభుత్వ ఆదాయానికి గండిచరిత్రలో తొలిసారి 'జీరో', ఆటో పరిశ్రమకు రూ.1 కోట్లకు పైగా నష్టం: ప్రభుత్వ ఆదాయానికి గండి

FPIs remain in selloff mode: pull out Rs 15,403 crore in April

పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను అమెరికా డాలర్ రూపంలో దాచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నికర ఔట్ ఫ్లో ఏప్రిల్ నెలలోను కొనసాగింది. కానీ మార్చిలో కనిపించిన రికార్డ్ స్థాయిలో మాత్రం కనిపించలేదు. గత కొంతకాలంగా కరోనా కారణంగా మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉన్న విషయం తెలిసిందే.

English summary

వరుసగా రెండో నెల తరలిపోయిన FPI: మార్చిలో రూ.1 లక్ష కోట్లు, ఏప్రిల్‌లో రూ.15,403 కోట్లు | FPIs remain in selloff mode: pull out Rs 15,403 crore in April

Continuing their selling spree for the second straight month, foreign portfolio investors (FPIs) withdrew a net Rs 15,403 crore from the Indian capital markets in April amid the coronavirus crisis.
Story first published: Sunday, May 3, 2020, 13:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X