For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IT Companies: ఐటీలో సత్తా చాటుతున్న భారత కంపెనీలు.. టాప్ 10లో మనవే 4 సంస్థలు..

|

ప్రపంచ ఐటీలో భారత్ సత్తా చాటుతోంది. తాజాగా బ్రాండ్ ఫైనాన్స్ 2023 నిర్వహించిన అధ్యయనంలో ప్రపంచంలోని టాప్ 10 ఐటీ కంపెనీల్లో 4 భారతీయ కంపెనీలున్నాయిని తేలింది.
టాప్ 10 ఐటీ కంపెనీల్లో యాక్సెంచర్ అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థ వరుసగా ఐదోసారి అగ్రస్థానంలో నిలిచింది.

యాక్సెంచర్

యాక్సెంచర్

ప్రస్తుతం యాక్సెంచర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $39.9 బిలియన్లుగా ఉంది. ఇది ప్రపంచంలోనే బలమైన ఐటీ బ్రాండ్ గా పేరు గాచింది. బ్రాండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ప్రకారం యాక్సెంచర్ కు 100 మార్కులకు గానూ 87.8 మార్కులు రావడంతో AAA బ్రాండ్ రేటింగ్ కూడా ఉంది.

టీసీఎస్

టీసీఎస్

ప్రపంచంలో రెండో ఐటీ కంపెనీగా భారత్ కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉంది. దీని మార్కెట్ విలువ 17.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ కంపెనీ అత్యుత్తమ భారతీయ ఐటీ కంపెనీగా నిలిచింది.

ఇన్ఫోసిస్

ఇన్ఫోసిస్

మరో భారత ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మూడో స్థానంలో నిలిచింది. కంపెనీ విలువ 13 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది కూడా గతేడాదితో పోలిస్తే 2 శాతం ఎక్కువ. ఇన్ఫోసిస్ ను నారాయణమూర్తి 1981లో ప్రారంభించారు. ఈ కంపెనీకి AAA రేటింగ్ ఉంది.

IBM

IBM

నాలుగో స్థానంలో అమెరికాన్ ఐటీ కంపెనీ IBM ఉంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ $11.6 బిలియన్లగా ఉంది. ఐదో స్థానంలో క్యాప్‌జెమినీ నిలిచింది. ఈ కంపెనీ విలువ 9.8 బిలియన్ డాలర్లగా ఉంది. NTT డేటా కంపెనీ అదే 6వ స్థానంలో ఉండగా... విలువ 8.9 బిలియన్ డాలర్లుగా ఉంది.

HCL టెక్

HCL టెక్

కాగ్నిజెంట్ 7వ స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ $8.6 బిలియన్లుగా ఉంది. 8వ స్థానంలో మరో భారతీయ కంపెనీ శివ్ నాడార్ HCL టెక్ ఉండగా... కంపెనీ మార్కెట్ విలువ $6.5 బిలియన్లుగా ఉంది. విప్రో 9వ స్థానంలో ఉంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ 6.2 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఎల్&టీ

ఎల్&టీ

ఎల్&టీ అత్యుత్తమ బ్రాండ్ విలువతో ఈ కంపెనీలలో 25వ స్థానంలో నిలిచింది. దీని మార్కెట్ విలువ గత ఏడాది కంటే 75% పెరిగి $1.9 బిలియన్లకు చేరుకుంది. L&C ఇన్ఫోటెక్.. మైండ్ ట్రీని కొనుగోలు చేయడంతో మార్కెట్ విలువ పెరిగింది. మరో భారతీయ కంపెనీ టెక్ మహీంద్రా కూడా గత ఏడాది కంటే 15% వృద్ధితో $3.5 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కలిగి ఉంది.

English summary

IT Companies: ఐటీలో సత్తా చాటుతున్న భారత కంపెనీలు.. టాప్ 10లో మనవే 4 సంస్థలు.. | Four IT companies from India have secured a place in the top 10 IT companies

India is showing power in global IT. A recent study conducted by Brand Finance 2023 revealed that 4 Indian companies are among the top 10 IT companies in the world.
Story first published: Saturday, January 21, 2023, 13:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X