For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Srilanka Crisis: శ్రీలంకలో కొత్త ఆంక్షలు.. ప్రజల వద్ద అంతంటే ఎక్కువ కరెన్సీ ఉండకూడదు..

|

Srilanka Crisis: ఆహారం, ఇంధనంతో సహా నిత్యావసరాల దిగుమతులకు అవసరమైన ఫారెక్స్ నిల్వలు వేగంగా శ్రీలంక వద్ద కరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఆ దేశం కొత్త ఆంక్షలను తీసుకొచ్చింది. తాజా నిబంధనలతో లంకలో ఒక వ్యక్తి విదేశీ కరెన్సీని కలిగి ఉండే పరిమితిని 15,000 అమెరికన్ డాలర్ల నుంచి 10,000 డాలర్లకు తగ్గించింది.

రుణాల డిఫాల్ట్..

రుణాల డిఫాల్ట్..

విదేశాల మద్దతు, సహకారం పొందేందుకు లంక తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.శ్రీలంక తీవ్రమైన ఫారెక్స్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇది ఏప్రిల్‌లో ద్వీప దేశం తన అంతర్జాతీయ రుణ చెల్లింపులను డిఫాల్ట్‌ అయింది. దశాబ్దాల్లో విదేశీ రుణాలను డిఫాల్ట్ చేసిన మొదటి ఆసియా-పసిఫిక్ దేశంగా నిలిచింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా.. ప్రజల చేతుల్లో ఉన్న విదేశీ కరెన్సీని అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి మళ్లించే ఉద్దేశ్యంతో ఆర్థిక మంత్రి రణిల్ విక్రమసింఘే ఫారిన్ ఎక్స్ఛేంజ్ చట్టం కింద తాజాగా త్తర్వులు జారీ చేశారు. అనపు విదేశీ కరెన్సీని డిపాజిట్ చేయడానికి లేదా అధీకృత డీలర్‌కు విక్రయించడానికి జూన్ 16, 2022 నుంచి 14 రోజుల పాటు అవశాన్ని కల్పించింది.

గవర్నర్ ఏమన్నారంటే..

గవర్నర్ ఏమన్నారంటే..

విదేశీ కరెన్సీని కలిగి ఉండే పరిమితిని 15,000 డాలర్ల నుంచి 10,000 డాలర్లకు తగ్గించే దిశగా అపెక్స్ బ్యాంక్ చూస్తోందని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ నందలాల్ వీరసింఘే చెప్పిన నెల తర్వాత ఈ చర్య వచ్చింది. కలిగి ఉన్న ఫారెన్ కరెన్సీకి సైతం తగిన రుజువులు తప్పనిసరిగా సమర్పించాలని గవర్నర్ చెప్పారు.

 క్యూ లైన్లలోనే ప్రజలు..

క్యూ లైన్లలోనే ప్రజలు..

శ్రీలంక 1948లో స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇది దేశవ్యాప్తంగా ఆహారం, మందులు, వంటగ్యాస్, ఇంధనం వంటి నిత్యావసర వస్తువుల కొరతకు దారితీసింది. కొలంబో ఏప్రిల్‌లో రుణాలపై డిఫాల్ట్‌గా ప్రకటించింది. దీని తర్వాత శ్రీలంక బాండ్‌లను కలిగి ఉన్న US బ్యాంక్ హామిల్టన్ రిజర్వ్, ఒప్పంద ఉల్లంఘనపై మాన్‌హాటన్‌లోని US జిల్లా కోర్టులో దావా వేసింది. దిగుమతులకు నిధుల కోసం ప్రభుత్వం డాలర్లను కనుగొనలేక పోవడంతో శ్రీలంక ప్రజలు సుదీర్ఘ ఇంధనం, వంట గ్యాస్ క్యూలలో కొట్టుమిట్టాడుతున్నారు.

 బెయిలౌట్‌ కోసం ప్రయత్నాలు..

బెయిలౌట్‌ కోసం ప్రయత్నాలు..

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)తో జరుగుతున్న చర్చలు బెయిలౌట్‌కు దారితీసే వరకు ఇంధనం, నిత్యావసరాల కోసం భారతీయ క్రెడిట్ లైన్‌లు లైఫ్‌లైన్‌లను అందించాయి. ఆర్థిక సంక్షోభాన్ని తప్పుగా నిర్వహించడం వల్ల ఏప్రిల్ ప్రారంభం నుంచి శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధి నిరసనలు కూడా జరిగాయి.మే 9న రాజకీయ సంక్షోభం హింసాకాండకు దారితీసింది. ఒక పార్లమెంటు సభ్యుడు సహా 10 మంది మరణించారు. రాజకీయ, ఆర్థిక సంక్షోభాల మధ్య అధ్యక్షుడు గోటబయ రాజపక్సే సోదరుడు మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

English summary

Srilanka Crisis: శ్రీలంకలో కొత్త ఆంక్షలు.. ప్రజల వద్ద అంతంటే ఎక్కువ కరెన్సీ ఉండకూడదు.. | foreign currency holding limit reduced by srilanka amid severe financial crisis

Reducing the amount of foreign currency retained in possession by a person in, or resident in, Sri Lanka from USD 15,000 to USD 10,000 or its equivalent in other foreign currencies an official statement said.
Story first published: Saturday, June 25, 2022, 19:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X