For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సల్మాన్‌ను దాటి ఫోర్బ్స్ నెం.1గా కోహ్లీ: లిస్ట్‌లో ప్రభాస్, మహేష్ బాబు, సంపాదన ఎంతంటే?

|

ఫోర్బ్స్ 2019 టాప్ 100 జాబితాలో భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ మొదటి స్థానం దక్కించుకున్నారు. 2019 ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీల్లో భారత కెప్టెన్ ముందుండగా, రెండో స్థానంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ రెండో స్థానంలో ఉన్నారు. సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో నిలిచారు. 2018 ఫోర్బ్స్ లిస్ట్‌లో సల్మాన్ మొదటి స్థానంలో నిలిచారు. కోహ్లీ రెండో స్థానంలో ఉన్నారు. అక్షయ్ కుమార్ మూడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు వారి స్థానాలు మారిపోయాయి.

బిజినెస్‌మెన్ అకౌంట్ నుంచి గ్రామాల్లోని జన్ ధన్ అకౌంట్లోకి..బిజినెస్‌మెన్ అకౌంట్ నుంచి గ్రామాల్లోని జన్ ధన్ అకౌంట్లోకి..

గతంలో కంటే ముందుకు.. వెనక్కి...

గతంలో కంటే ముందుకు.. వెనక్కి...

4వ స్థానంలో అమితాబ్ బచ్చన్, 5వ స్థానంలో ఎంఎస్ ధోనీ, 6వ స్థానంలో షారుక్ ఖాన్, 7వ స్థానంలో రణ్‌వీర్ సింగ్, 8వ స్థానంలో అలియా భట్, 9వ స్థానంలో సచిన్ టెండుల్కర్, 10వ స్థానంలో దీపిక్ పదుకొణే ఉన్నారు. ధోనీ, సచిన్‌లు గత ఏడాది ఏ స్థానంలో ఉన్నారో ఇప్పుడు అదే స్థానం దక్కించుకున్నారు. షారుక్ ఖాన్ 7 ర్యాంకులు ముందుకు రాగా, అమితాబ్ 3 ర్యాంకులు ముందుకు వచ్చారు. రణ్‌వీర్ ఒక ర్యాంకు, అలియా భట్ నాలుగు ర్యాంకులు ముందుకు వచ్చారు. దీపికా ఏకంగా ఆరు ర్యాంకులు వెనక్కి పోయారు.

వారి సంపాదన...

వారి సంపాదన...

ఫోర్బ్స్ 2019 జిబాతా ప్రకారం వారి సంపాదన ఇలా ఉంది. కోహ్లీ రూ.252.72 కోట్లు, అక్షయ్ కుమార్ రూ.293.25 కోట్లు, సల్మాన్ ఖాన్ రూ.229.25 కోట్లు, అమితాబ్ బచ్చన్ రూ.239.25 కోట్లు, ఎంఎస్ ధోనీ రూ.135.93 కోట్లు, షారుక్ ఖాన్ రూ.124.38 కోట్లు, రణ్ వీర్ సింగ్ రూ.118.2 కోట్లు, అలియా భట్ రూ.59.21 కోట్లు, సచిన్ టెండుల్కర్ రూ.76.96 కోట్లు, దీపికా పదుకొణే రూ.48 కోట్లు.

టాప్ 10 నుంచి 20 వరకు...

టాప్ 10 నుంచి 20 వరకు...

క్రికెటర్ రోహిత్ శర్మ 11వ ర్యాంకులో (సంపాదన రూ.54.29), బాలీవుడ్ స్టార్ 12వ స్థానంలో అజయ్ దేవగణ్ (రూ.94), సూపర్ స్టార్ రజనీకాంత్ 13వ స్థానంలో (రూ.100 కోట్లు), ప్రియాంక చోప్రా 14వ స్థానంలో (రూ.23.4 కోట్లు), అమీర్ ఖాన్ 15వ స్థానంలో (రూ.85 కోట్లు), ఏఆర్ రెహ్మాన్ 16వ స్థానంలో (రూ.94.8 కోట్లు), ప్రీతమ్ 17వ స్థానంలో (రూ.97.78 కోట్లు), హృతిక్ రోషన్ 18వ స్థానంలో (రూ.58.73 కోట్లు), అమిత్ త్రివేది 19వ స్థానంలో రూ.(80.73 కోట్లు), విశాల్ శేఖర్ 20వ స్థానంలో (రూ.76.84 కోట్లు) ఉన్నారు.

టాప్ 50లో...

టాప్ 50లో...

టాప్ 10లోని ప్రముఖులు... అనుష్క శర్మ 21, కత్రినా కైఫ్ 23, వరుణ్ ధావన్ 25, మోహన్ లాల్ 27, శ్రద్ధా కపూర్ 28, నెహా కక్కర్ 29, రిషబ్ పంత్ 30, హార్దిక్ పాండ్యా 31, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ 32, జస్ప్రీత్ బూమ్రా 33, కేఎల్ రాహుల్ 34, శిఖర్ ధావన్ 35, షాహిద్ కపూర్ 36, పరిణీతి చోప్రా 41, సోన్ కపూర్ 42, దిశా పఠాని 43, తెలుగు సూపర్ స్టార్ ప్రభాస్ 44 (సంపాదన రూ.35 కోట్లు), తమిళ నటుడు విజయ్ 47, సన్నీ లియోన్ 48వ స్థానంలో ఉన్నారు.

టాప్ 100లో...

టాప్ 100లో...

టాప్ 50 నుంచి 100లో రవీంద్ర జడెజా, కపిల్ మిశ్రా, తెలుగు నటుడు మహేష్ బాబు (54వ ర్యాంకు, సంపాదన రూ.35 కోట్లు)), కమల్ హాసన్, సోనాక్షి సిన్హా, మమ్ముట్టి, పీవీ సింధూ, ధనుష్, తాప్సీ పన్ను, శిల్పా శెట్టి, సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్, స్మృతి మందానా, రోహన్ బోపన్నా తదితరులు ఉన్నారు. మహేష్ బాబు గత ఏడాది 33వ ర్యాంకులో ఉండగా ఈసారి 54కు పడిపోయారు.

English summary

సల్మాన్‌ను దాటి ఫోర్బ్స్ నెం.1గా కోహ్లీ: లిస్ట్‌లో ప్రభాస్, మహేష్ బాబు, సంపాదన ఎంతంటే? | Forbes 2019: Virat Kohli topples Salman Khan for top spot on 2019 Celebrity 100 list

In 2018, the domination of the Khans of Bollywood was being challenged–at least in terms of annual earnings–by a sportsman: The hugely popular and ever consistent cricketer Virat Kohli.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X