For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Economic Survey: ఆర్థిక సర్వేలో వెల్లడైన సవాళ్లు.. ఎదుర్కొంటామని నిర్మలమ్మ ధీమా..!

|

Economic Survey: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రసంగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఎకనమిక్ సర్వేలో ఎలాంటి విషయాలు వెల్లడవుతాయనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఎదుర్కోనున్న సవాళ్లను కేంద్రం ఇందులో అంచనా వేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రజలతో పాటు ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాల్సిన విషయాలు ఇందులో వెల్లడించబడతాయి. దీనివల్ల ముందుగా చర్యలు చేపట్టడానికి వీలు కలగనుంది.

సర్వే సమర్పణ..

సర్వే సమర్పణ..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను దేశ జీడీపీ వృద్ధి రేటు 6-6.8 శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు వెల్లడించారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 7 శాతంగా ఉంటుందని అంచనా వేయటం జరిగింది. ఐఎమ్ఎఫ్ సైతం రానున్న ఏడాది ఆర్థిక వృద్ధి కొంత తగ్గుతుందని తన నివేదికలో తెలిపింది.

 వాటితో జీడీపీ గ్రోత్..

వాటితో జీడీపీ గ్రోత్..

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే కలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి ప్రైవేట్ వినియోగం, అధిక క్యాపెక్స్, కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేయడం, చిన్న వ్యాపారాలకు రుణ వృద్ధి, వలస కార్మికులు నగరాలకు తిరిగి రావడం ద్వారా ముందుకు నడిచేందుకు దోహదపడుతుందని ఆర్థిక సర్వే వెల్లడించింది.

ద్రవ్యోల్బణం..

ద్రవ్యోల్బణం..

ప్రస్తుతం దేశంలోని ప్రజలను మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందిరనీ ఆందోళనకు గురిచేస్తున్న విషయం ద్రవ్యోల్బణం. ఈ ఆర్థిక సంవత్సరం ఇది 6.8 శాతంగా ఉంటుందని ఆర్బీఆ అంచనా వేసింది. అయితే ఇది ఆర్బీఐ పెట్టుకున్న గరిష్ఠ లక్ష్య పరిమితి కంటే ఎక్కువని చెప్పుకోవాలి. దీనివల్ల పరోక్షంగా రుణగ్రహీతలకు ఇప్పట్లో ఊరట లభించకపోవచ్చని తెలుస్తోంది. మరింత కాలం వడ్డీల భారం మోయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

కరెంట్ ఖాతా లోటు..

కరెంట్ ఖాతా లోటు..

ప్రపంచ కమోడిటీ ధరలు అధిక స్థాయిలో ఉండడం వల్ల కరెంట్ ఖాతా లోటు పెరగవచ్చని సర్వే పేర్కొంది. అయితే ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని సర్వే వెల్లడించింది. విదేశీ మారకపు మార్కెట్‌లో జోక్యం చేసుకోవడానికి తగినంత విదేశీ మారక నిల్వలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. భారతదేశ కరెంట్ ఖాతా లోటు నియంత్రణలో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల వెల్లడించారు. రూపాయి ప్రపంచంలోని చాలా కరెన్సీల కంటే మెరుగైన స్థితిలో ఉంది. అయితే యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ క్షీణత సవాలుగా మిగిలిపోయిందని ఆర్థిక మంత్రి వెల్లడించారు.

English summary

Economic Survey: ఆర్థిక సర్వేలో వెల్లడైన సవాళ్లు.. ఎదుర్కొంటామని నిర్మలమ్మ ధీమా..! | FM Nirmala sitharaman presented Economic Survet 2023 in parliament know impact

FM Nirmala sitharaman presented Economic Survet 2023 in parliament know impact
Story first published: Tuesday, January 31, 2023, 15:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X