For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Union Budget 2022: నిర్మలమ్మ లేకుండా ఎలా.. అవమానం

|

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను వచ్చే ఫిబ్రవరి 14న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ తయారీకి ముందు వివిధ వర్గాలతో కేంద్ర ఆర్థికమంత్రి భేటీ అవుతారు. వారు తమ తమ కోరికలను వెల్లడిస్తారు. అలాగే వారి సూచనలు తీసుకుంటారు. అయితే ప్రీ-బడ్జెట్ సమావేశానికి ఆర్థికమంత్రి గైర్హాజరు అయ్యారు. దీనిపై ట్రేడ్ యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సమావేశాన్ని సరైన రీతిలో నిర్వహించలేదని కేంద్ర ఆర్థిక శాఖపై ట్రేడ్ యూనియన్లు ఆగ్రహించాయి. బడ్జెట్ ముందస్తు చర్చలకు కేంద్ర ఆర్థికమంత్రి హాజరవుతారు. శనివారం వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశానికి నిర్మలమ్మ గైర్హాజరయ్యారు. దీనిపై యూనియన్లు తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ సమావేశం సెంట్రల్ ట్రేడ్ యూనియన్లకు (CTU) అవమానకరమన్నాయి. ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి అధ్యక్షతన గంటంపావు పాటు ఈ సమావేశం జరిగింది.

మళ్లీ నిర్వహించాలి

మళ్లీ నిర్వహించాలి

ప్రీ-బడ్జెట్ సమావేశాలు సరిగ్గా నిర్వహించలేదని ఆర్థికశాఖపై కేంద్ర ట్రేడ్ యూనియన్లు నిరసన వ్యక్తం చేయడంతోపాటు, ముందస్తు బడ్జెట్ చర్చలు మళ్లీ పెట్టాలని డిమాండ్ చేశాయి. మొదటిసారి ఆర్థికమంత్రి లేకుండా, అది కూడా తక్కువ సమయమే జరిగిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకే ఈసారి ఎక్కువ సమయం జరిగేలా భౌతిక సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. వర్చువల్ విధానంలో శనివారం జరిగిన ముందస్తు బడ్జెట్‌ సమావేశం కేవలం గం.1.15 నిమిషాలే జరిగిందని, మధ్యలో టెక్నికల్ సమస్యలు వచ్చాయన్నారు.

ఇది విచారకరం

ఇది విచారకరం

సీతారామన్ హాజరు కాకుండా కేవలం సహాయ మంత్రిత్వ అధికారులు హాజరుకావడం, సమావేశానికి సీఐఐ, ఫిక్కీ వంటి సంస్థలు కూడా రావడం కేంద్ర ట్రేడ్ యూనియన్లను అవమానించడమేనని భారతీయ మజ్దూర్ సంఘ్ సాధారణ కార్యదర్శి బినోయ్ కుమార్ అన్నారు. ఇతర యూనియన్లు అదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. సమావేశానికి నిర్మలమ్మ తమను ఆహ్వానించి, తాను హాజరుకాకపోవడం విచారకరమని బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి బినోయ్ కుమార్ సిన్హా అన్నారు.

ఆహ్వానించి..

ఆహ్వానించి..

కాగా, మంత్రిత్వ శాఖ దృష్టిలో ట్రేడ్ యూనియన్లు అంటే చులకనగా ఉందని, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ అన్నారు. 14 ట్రేడ్ యూనియన్లను ఆహ్వానించి, ఆర్థికమంత్రి రాకపోవడం ఎలా అన్నారు. ఒక్కొక్కరికి మూడు నిమిషాల సమయం ఇచ్చారని, కార్మికుల పట్ల చిన్నచూపు చూశారన్నారు. మాట్లాడుతుంటే కనెక్షన్ కట్ అయిందని చెప్పారు.

English summary

Union Budget 2022: నిర్మలమ్మ లేకుండా ఎలా.. అవమానం | FM did not attend pre budget discussion meeting, trade union unhappy

The Central Trade Unions (CTUs) have strongly objected to the Finance Ministry for not holding a proper meeting with them before the upcoming budget.
Story first published: Sunday, December 19, 2021, 8:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X