For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Union Budget 2023: సీనియర్ సిటిజన్లకు ఊరట.. మహిళలకు అధిక వడ్డీ రేటు స్కీమ్..

|

Union Budget 2023: లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా పరిశ్రమలకు ముడి సరుకు, కోల్, ధాన్యాల రవాణాకు పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం రూ.75 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో అదనంగా 50 విమానాశ్రయాలు, హెలీపోర్ట్స్, వాటర్ ఏరో డ్రోమ్స్, అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్ ఏర్పాటు ద్వారా రీజినల్ ఎయిర్ కనెక్టివిటీ పెంచనున్నట్లు నిర్మలమ్మ వెల్లడించారు.

 మహిళల కోసం..

మహిళల కోసం..

దేశంలోని మహిళల సేవింగ్స్ పెంచేందుకు మహిళా సమ్మాన్ పత్రను తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీనిపై వడ్డీ రేట్లు అత్యధికంగా 7.5 శాతం అందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. దీనికి తోడు దేశంలో 50 టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం రూ.35,000 కోట్లు, బ్యాటరీ నిల్వ కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌లు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం జోడింపులను నిర్మలమ్మ ప్రకటించారు.

సీనియర్ సిటిజన్లకు..

సీనియర్ సిటిజన్లకు..

కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ సీనియన్ సిటిజన్లకు పెద్ద ఊరట ప్రకటించారు. దీని ప్రకారం డిపాజిట్ గరిష్ఠ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. ఇదే క్రమంలో ఆర్థిక లోటు గురించి ప్రస్థావించారు. 2024 ఆర్థిక సంత్సరానికి డీజీపీలో ఆర్థిక లోటు 5.9 శాతంగా ఉంటుందని నిర్మలమ్మ వెల్లడించారు. దీనికి తోడు 2025-26 నాటికి ద్రవ్య లోటు లక్ష్యం 6.5% కంటే తక్కువదా ఉండనున్నట్లు తన ప్రసంగంలో వెల్లడించారు.

 కీలక ప్రకటనలు..

కీలక ప్రకటనలు..

- FY24 స్థూల రుణ లక్ష్యం రూ.15.43 లక్షల కోట్లు

- FY24 కోసం ద్రవ్య లోటు లక్ష్యం 5.9%

- FY23 కోసం ద్రవ్య లోటు GDPలో 6.4%గా అంచనా వేయబడింది

- FY26 కోసం ద్రవ్య లోటు గ్లైడ్ పాత్ 4.5%

- 'మేక్ ఇన్ ఇండియా'కు పెద్ద పుష్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది లిథియమ్ అయాన్ బ్యాటరీ, మొబైల్, టీవీ, చిమ్నీ తయారీకి అనుకూల రాయితీలను నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

English summary

Union Budget 2023: సీనియర్ సిటిజన్లకు ఊరట.. మహిళలకు అధిక వడ్డీ రేటు స్కీమ్.. | FM announced big news to senior citizens, women savings scheme know details

FM announced big news to senior citizens, women savings scheme know details
Story first published: Wednesday, February 1, 2023, 12:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X