ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్(ABFRL)లో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వాటాను కొనుగోలు చేయనుంది. దీని ద్వారా ABFRL రూ.1,500 కోట్ల నిధులను సమీకరించనుంది. ఈ మేరకు శుక్రవారం స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది. వీటిని ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ షేర్స్ ద్వారా సమీకరిస్తుంది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్‌లో ఫ్లిప్‌కార్ట్ రూ.1500 కోట్ల (203.78 మిలియన్ డాలర్లు) పెట్టుబడి ద్వారా 7.8 శాతం వాటాను దక్కించుకోనుంది. పాంటాలూన్స్, అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లాండ్ వంటి బ్రాండ్స్ ఉన్నాయి.

మరింత విస్తరణకు అవకాశం
ఒక్కో షేర్‌కు రూ.205 వద్ద ట్రాన్సాక్షన్ జరగనుంది. గురువారం ఈ షేర్ రూ.153.40 వద్ద ముగిసింది. ఈ క్లోజింగ్ ధరతో 33.63 శాతం అధికం. ఈ మేరకు కుమార మంగళం బిర్లా గ్రూప్‌నకు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ ఒప్పందం కుదుర్చుకుందని తెలిపింది. దీంతో దేశీ దుస్తుల మార్కెట్లో కంపెనీ మరింత విస్తరించే అవకాశం ఉందని ABFRL చైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. వచ్చే అయిదేళ్లలో దేశీయ దుస్తుల పరిశ్రమ 100 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునన్నారు. ఫ్లిప్‌కార్ట్‌కు వాటా విక్రయం ద్వారా వచ్చే నిధులు బ్యాలెన్స్ షీట్ పటిష్టతకు, వృద్ధి అవకాశాలకు వినియోగిస్తామన్నారు.

దూసుకెళ్లిన షేర్లు
ఫ్లిప్‌కార్ట్‌కు వాటా విక్రయం అనంతరం ప్రమోటర్ల వాటా 55.13 శాతానికి తగ్గనుంది. ABFRLలో ఫ్లిప్‌కార్ట్ వాటా కొనుగోలు వార్త నేపథ్యంలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ స్టాక్ శుక్రవారం భారీగా ఎగిసింది. 13.15 శాతం లాభపడి రూ.175 వరకు చేరుకుంది.

రెండో అతిపెద్ద డీల్
2020లో ఆఫ్‌లైన్ కన్స్యూమర్ స్పేస్‌లో ఇది రెండో పెద్ద డీల్ అవుతుంది. ఆగస్ట్ నెలలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్.. కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ వ్యాపారాన్ని రూ.24,713 కోట్లకు కొనుగోలు చేసింది. ABFRLకి దేశవ్యాప్తంగా 3,004 స్టోర్స్ ఉన్నాయి. 23,700 మల్టీ బ్రాండ్ ఔట్ లెట్లలో ఉన్నాయి. పాంటాలూన్స్ రిటైల్‌తో పాటు వాన్ హ్యూసెన్, లూయిస్ పిలిప్, అలెన్ సోలి, పీటర్ ఇంగ్లాండ్ ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications