For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టచ్ అండ్ ఫీల్: కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ సరికొత్త అనుభూతి

|

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. తమ కస్టమర్లకు టచ్ అండ్ ఫీలింగ్ కాన్సెప్ట్‌తో కొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు స్థానిక దుకాణదారులతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని భావిస్తోంది. లోకల్ వెండర్స్‌ను ఆన్‌బోర్డుకు తీసుకు వచ్చే ఆలోచను రిలయన్స్ రిటైల్ ప్లాన్ చేస్తోంది. వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే స్థానిక కిరాణా దుకాణాల ద్వారా డెలివరీ మోడల్‌ను తీసుకు వచ్చింది.

వినియోగదారులకు తమకు కావాల్సిన ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా చూసి కొనుగోలు చేస్తున్నారు. ఇక నుండి తొలుత స్థానిక దుకాణాల్లోకి వెళ్లి, ఆ వస్తువును చూసి పరిశీలించిన తర్వాత నచ్చితే ఆర్డర్ చేయవచ్చు. కస్టమర్లకు టచ్ అండ్ ఫీల్ అనుభూతిని ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

భారత ఆర్థిక వ్యవస్థకు పెనుప్రమాదం! వొడాఫోన్-ఐడియా మూతబడితే.. ఎవరెవరిపై ఎలా?భారత ఆర్థిక వ్యవస్థకు పెనుప్రమాదం! వొడాఫోన్-ఐడియా మూతబడితే.. ఎవరెవరిపై ఎలా?

Flipkart mulling tie up with local stores to offer customers Touch and Feel Experience

ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ బై జోన్స్ ఏర్పాటు చేయనుంది. కస్టమర్ నేరుగా అందులోకి వెళ్లి కొనుగోలు చేయాలనుకున్న వస్తువును పరిశీలించవచ్చు. అయితే, కొనుగోలు చేయడానికి మాత్రం అక్కడ అవకాశముండదు. ఆ వస్తువును యథావిధిగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయాలి.

ఈ పైలట్ ప్రాజెక్టుని తొలుత హైదరాబాదులో ప్రారంభించారు. ఇది విజయవంతమైంది. టచ్ అండ్ ఫీల్ అనుభూతి కోసం లోకల్ దుకాణాలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ కో-ఆపరేటివ్ అఫైర్స్ ఆఫీసర్ రజ్‌నీష్ వెల్లడించారు. దీనిని విస్తరిస్తామన్నారు.

English summary

టచ్ అండ్ ఫీల్: కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ సరికొత్త అనుభూతి | Flipkart mulling tie up with local stores to offer customers Touch and Feel Experience

E-commerce major Flipkart is contemplating to go for partnership with local stores offering its customers a touch and feel experience, at least for some products, as online commerce continues to be minuscule in the overall Indian retail industry.
Story first published: Tuesday, February 18, 2020, 14:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X