For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.58వేల కోట్లు.. ఫెస్టివెల్ సీజన్‌లో పెరిగిన ఆన్‌లైన్ సేల్స్: మొబైల్స్ హిట్

|

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ సేల్స్‌లో వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్ పండుగ విజేతగా నిలిచింది. ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు అక్టోబర్-నవంబర్ పండుగ కాలంలో విక్రయాల్లో 90 శాతం వాటాను నమోదు చేశాయి. కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ నివేదిక ప్రకారం ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ వాటా 66 శాతంగా ఉంది. ఈ ఏడాది పండుగ సీజన్‌లో గత ఏడాదితో పోలిస్తే కస్టమర్ గ్రోత్ 88 శాతం పెరిగింది. ఈ ఏడాది సేల్స్ ప్రధానంగా టైర్ 2 నగరాల నుండి ఎక్కువగా ఉన్నాయి.

అమెరికా, చైనా సహా ఈ దేశాలతో భారత్‌లోనే ప్రయాణాలు ఆగిపోయాయిఅమెరికా, చైనా సహా ఈ దేశాలతో భారత్‌లోనే ప్రయాణాలు ఆగిపోయాయి

నెల రోజుల సేల్స్.. భారీగా అమ్మకాలు

నెల రోజుల సేల్స్.. భారీగా అమ్మకాలు

ఈ-కామర్స్ పండుగ అమ్మకాలు ఈసారి భారీగా నమోదయ్యాయి. అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 15వ తేదీ వరకు ఆన్‌లైన్ సంస్థల స్థూల విక్రయాలు దాదాపు రూ.58 వేలకోట్లు(8.3 బిలియన్ డాలర్లు)గా ఉన్నట్లు రీసెర్చ్ సంస్థ రెడ్ సీర్ తెలిపింది. పండుగ సీజన్‌కు ముందు 7 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని రెడ్ సీర్ అంచనా వేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో ఆన్ లైన్ షాపింగ్‌ రూ.35వేల కోట్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే సేల్స్ భారీగా పెరిగాయి. 'ది ఫెస్టివల్‌ ఆఫ్ ఫస్ట్స్' పేరుతో రెడ్ సీర్ ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రూ.22వేల కోట్ల విక్రయాలు జరిగినట్లు తెలిపింది. పండుగ సీజన్లో సేల్స్ రెట్టింపునకు పైగా ఎగబాకాయి.

కరోనా ప్రభావం

కరోనా ప్రభావం

ఈ ఏడాది ఫెస్టివెల్ సేల్స్ బుల్లిష్‌గా ఉన్నాయని, తాము 7 బిలియన్ డాలర్ల మేర అంచనా వేయగా, దానిని అధిగమించినట్లు రెడ్ సీర్ డైరెక్టర్ తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువమంది ఆన్ లైన్ ద్వారా కొనుగోళ్లకు మొగ్గు చూపినట్లు దీని ద్వారా వెల్లడవుతోందన్నారు. ఈ పండుగ సీజన్ ఈ-కామర్స్ దిగ్గజాలకు గతంలో కంటే సేల్స్ పెరిగాయన్నారు.

మొబైల్ హిట్... ఫ్యాషన్ ఫట్

మొబైల్ హిట్... ఫ్యాషన్ ఫట్

ఆన్‌లైన్ సేల్స్ పెరుగుతుండటంతో బ్రాండ్స్, అమ్మకందారులు ఇటువైపు దృష్టి సారించాయని చెబుతున్నారు. ప్రీసేల్ అవేర్‌నెస్, విస్తృత ఎంపికల అవకాశం, సరఫరా గొలుసు పెరగడం వంటి వివిధ కారణాలు సేల్స్‌కు దోహదపడ్డాయన్నారు. ఆన్‌లైన్ సేల్స్‌లో మొబైల్ ఫోన్ల వాటా ఎక్కువగా ఉంది. హోమ్ డెకార్స్, ఫర్నీచర్ టుక్ ఓవర్ ఫ్యాషన్ సేల్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఫ్యాషన్ విక్రయాలు తగ్గాయి.

English summary

రూ.58వేల కోట్లు.. ఫెస్టివెల్ సీజన్‌లో పెరిగిన ఆన్‌లైన్ సేల్స్: మొబైల్స్ హిట్ | Flipkart had 66 percent share against Amazon in online festive sales

Flipkart emerged as the winner in the recent festive sales where the Walmart-owned e-commerce player battled against Amazon in Indian market.
Story first published: Monday, November 30, 2020, 15:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X